శ్రీమంతుడు స్పెషల్ షోలతో 8 లక్షలు

నైజాం ఏరియాలో శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడు పోయాయి. ఇప్పుడు అదే సినిమా బెనిఫిట్ లేదా స్పెషల్ షోలు కూడా మంచి రేట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్…

నైజాం ఏరియాలో శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడు పోయాయి. ఇప్పుడు అదే సినిమా బెనిఫిట్ లేదా స్పెషల్ షోలు కూడా మంచి రేట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ ఎనభై లక్షలు చెల్లించి, 10 షోలకు అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీటిలో సిటీలో అయిదు, వరంగల్, ఖమ్మం, నిజమాబాద్, మరో రెండు ప్రాంతాల్లో కలిపి అయిదు షోలు వేస్తారు. ఇదిలా వుంటే 10 షోలు కొన్న సంస్థ రెండు షోలను మంచి ప్రాఫిట్ కు మారుబేరం చేసేసినట్లు వినికిడి. అంటే దీన్ని బట్టి శ్రీమంతుడు హైప్ బాగానే అందుకుంది అనుకోవాలి.