టెంపర్ అమ్మకాల కౌంటర్ తెరిచీ తెరియనట్లు వుంచారు నిర్మాత బండ్ల గణేష్. ఆ సినిమాపై ఆయన పిచ్చ కాన్ఫిడెన్స్ గా వున్నారు. ఓవర్ సీస్ రేటు ను ఆయన మూడున్నర నుంచి నాలుగు కోట్ల మధ్య ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే అంత వస్తుందా అన్నది అనుమానం. ఎందకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో వుంది.
మూడున్నరకు కాస్త అటుగా వస్తే చాలని బండ్ల చూస్తున్నారని వినికిడి. కాదు, మూడుకు ఇచ్చేసారని టాక్. అది నిజం కాదని, మూడున్నరకు పైగా రాకుంటే స్వంతగా రిలీజ్ చేసుకుంటానని బండ్ల చెబుతున్నారట.
మూడున్నరకు తక్కువైతే తనకు నష్టం అంటున్నారట. సినిమాకు ఇంకా రావాల్సినంత హైప్ రాలేదు. తొలి టీజర్ మరీ అంత సూపర్ గా లేదు. ట్రయిలర్ వస్తే తప్ప, హైప్ ఊపందుకోదు. ఈ నెలాఖరులో అడియో విడుదల సందర్భంగా థియేటర్ ట్రయిలర్ విడుదల చేసే అవకాశం వుంది.