చక్రీ..వింటున్నావా..కంటున్నావా?

నా భర్తను అమ్మ, అప్పచెల్లెళ్లే చంపేసారు… చక్రి ఆస్తి కోసమే ఇదంతా-చక్రి భార్య Advertisement చక్రిని భార్యే చంపేసింది..చక్రి భార్య కేసినోలకు తిరిగేది.. -అన్నదమ్ముడు..తల్లి మహానుభావుడు కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు..మానవ సంబంధాలన్నీ ఆర్థిక…

నా భర్తను అమ్మ, అప్పచెల్లెళ్లే చంపేసారు… చక్రి ఆస్తి కోసమే ఇదంతా-చక్రి భార్య

చక్రిని భార్యే చంపేసింది..చక్రి భార్య కేసినోలకు తిరిగేది.. -అన్నదమ్ముడు..తల్లి

మహానుభావుడు కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు..మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. సంగీత దర్శకుడు చక్రి మరణం అనంతరం జరగుతున్న సంఘటనలన్నీ ఈ మాటలను గుర్తుచేస్తున్నాయి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడితే. ఒక్క విషయం చక్రి తల్లి,తమ్ముడు,ఎందుకు ఆలోచించడం లేదు. 

చక్రి బ్యాంకు కార్డులతో కానీ, ఆస్తులతో కానీ వాహనాలతో కానీ వారికి ఏమిటి సంబంధం? చక్రి కి భార్య వుంది. ఆయన కు అప్పులున్నా, ఆస్తులున్నా ఆమెకు సంబంధం కానీ వారికి ఏ మేరకు సంబంధం. దానికి కోసం వారు వెంపర్లాడాల్సిన లేదా ఇలా ఆరోపణలు చేసి పోరాడాల్సిన అవసరం ఏమిటి? 

అందుకోసం ఇంతలా రెండు వైపుల వారు దిగజారిపోయి, బజారుకు ఎక్కడం ఏమిటి? పొరుగింటి కయ్యం వినవేడుక అన్నది సామెత,. ఇప్పుడు చక్రి కుటుంబ వ్యవహారం అలాగే వుంది. టీవీలకు టీఆర్పీ రేటింగ్ లు పెంచుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాదు. ఈ లోగా నువ్వు దొంగ అంటే, నువ్వు ఖూనీ కోరు అని వీళ్ల బతుకుల్ని వీళ్లు పలుచన చేసుకుంటారు. అంతే.