టెంపర్ కథ కు కోటి నాలుగు లక్షలు

టెంపర్ కథకు వక్కతం వంశీకి కుదిరిన ఒప్పందం అక్షరాలా కోటి నాలుగు లక్షలట. ఇప్పటికి దీనికి గాను అందిన పార్ట్ పేమెంట్ యాభై లక్షలట. అంత విలువైన కథ ఏమిటో టెంపర్ అన్నది తెలియదు. …

టెంపర్ కథకు వక్కతం వంశీకి కుదిరిన ఒప్పందం అక్షరాలా కోటి నాలుగు లక్షలట. ఇప్పటికి దీనికి గాను అందిన పార్ట్ పేమెంట్ యాభై లక్షలట. అంత విలువైన కథ ఏమిటో టెంపర్ అన్నది తెలియదు. 

తెలిసిన మేరకు, పోలీసుల అవినీతి సంపాదన చూసి పెరిగిన కుర్రాడు, తాను పోలీసు కావాలనుకుని, లక్ష్యం నెరవేర్చుకుంటాడు. అవినీతి సంపాదన ప్రారంభిస్తాడు. అయితే తన వల్ల కొందరు దెబ్బతిన్నారని తెలుసుకుని, ఆపై డబుల్ గేమ్ ఆడి,విలన్ ప్రకాష్ రాజ్ ను దెబ్బ తీస్తాడు. ఈ కథ వినగానే అనేకానేక సినిమా కథలు గుర్తుకు వస్తాయి. 

మరి అలాంటి కథకు కోటి నాలుగు లక్షలు పేమెంట్ అంటే అద్భుతమే. అయితే ఈ విషయంలో నిర్మాత హ్యాపీయేనట. ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్ కలిసి ఈ మొత్తం కాబట్టి, ఫరావాలేదని అనుకుంటున్నాడట.

అన్నట్లు టెంపర్ సినిమా హక్కులు నెల్లూరుకు తీసుకుందామని అనుకున్న వక్కతం వంశీ ఇప్పడు వెనుకంజ వేస్తున్నాడట. తనకు రావాల్సిన మొత్తం పోను మిగిలిన మొత్తం ఇవ్వడానికి దగ్గర డబ్బులు లేక వద్దంటున్నాడట. అదీ సంగతి.