‘గోపాల గోపాల’ ఫస్ట్ డే షేర్ తెలుగు రాష్ట్రాల వరకు దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు వచ్చిందని అంచనా. ఇంకా స్పష్టమైన లెక్కలు రాలేదు కానీ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం తొలి రోజు షేర్ పన్నెండు కోట్ల పైనే ఉంటుందట. రెండవ రోజు వసూళ్లు కూడా ఊహించినట్టుగానే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి.
ఈ చిత్రానికి అసలు పరీక్ష రేపటి నుంచి మొదలవుతుంది. మాస్ సెంటర్స్ నుంచి రెస్పాన్స్ కానీ, టాక్ కానీ అంత గొప్పగా లేదు. అయినప్పటికీ సంక్రాంతి పండగ సీజన్ ముగిసే వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి లోటు రాదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ‘ఐ’ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనేది కూడా ‘గోపాల గోపాల’ని ప్రభావితం చేస్తుంది.
ఇంతకీ ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే ఎంత షేర్ రాబట్టాలి. జరిగిన బిజినెస్‌ని బట్టి టోటల్‌గా నలభై అయిదు కోట్ల పైన బిజినెస్ చేసినట్టయితే హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది. ప్రస్తుత కలెక్షన్స్ ట్రెండ్‌ని బట్టి, రానున్న పండక్కి ‘ఐ’ తప్ప మరో పెద్ద సినిమా ఏదీ లేదు కాబట్టి నలభై కోట్ల వరకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఆపైన ఇక పవన్‌కళ్యాణ్ దీనిని ఎంత వరకు పుల్ చేస్తాడనేది చూడాలంటున్నారు.