Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సునీల్ బెంగుళూరు డేస్

సునీల్ బెంగుళూరు డేస్

బెంగళూర్ డేస్ సినిమా హక్కులు తీసుకుని చాన్నాళ్లయింది. పివిపి సంస్థ దీన్ని తెరకు ఎక్కించాల్సి వుంది. సరైన స్టార్ కాస్ట్ కోసం చూస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో సునీల్ ఓ క్యారెక్టర్ కు ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఏడాదిగా ఖాళీగా వున్నాడు సునీల్. 

భీమవరం బుల్లోడు ఫరవాలేదు అనిపించుకున్నా, తరువాత సినిమాలు అంతగా రాలేదు. దిల్ రాజు సినిమా ఓపెనింగ్ జరుపుకుని అలా వుంది. గోపీ మోహన్ సినిమా అన్నారు అదేమయిందో తెలియదు. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ తో అయినా సునీల్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకు వస్తే అదే పదివేలు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?