నాగ్ మ‌రో ప్రయోగం

కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప‌చ్చజెండా ఊపేస్తుంటారు నాగార్జున‌. మ‌నంతో ఆయ‌న బాధ్యత మ‌రింత పెరిగింది. అందుకే కొత్త క‌థ‌ల వైపు మ‌రింత‌గా దృష్టిసారించారు. ఇప్పుడు చేస్తున్న సొగ్గాడే చిన్ని నాయిన కూడా ఓ ప్రయోగం…

కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప‌చ్చజెండా ఊపేస్తుంటారు నాగార్జున‌. మ‌నంతో ఆయ‌న బాధ్యత మ‌రింత పెరిగింది. అందుకే కొత్త క‌థ‌ల వైపు మ‌రింత‌గా దృష్టిసారించారు. ఇప్పుడు చేస్తున్న సొగ్గాడే చిన్ని నాయిన కూడా ఓ ప్రయోగం లాంటి క‌థేన‌ట‌. 

ఆ త‌ర‌వాత కూడా ఆయ‌న అదే దారిలో న‌డ‌వ‌బోతున్నారు. మా టీవీలో ప్రసారం అవుతున్న మీలో ఎవ‌రు కోటీశ్వరుడు కార్యక్రమంతో ఆయ‌న ఇంటిల్లిపాదికీ మ‌రింత ద‌గ్గర‌య్యారు. ఇప్పుడు మీలో ఎవ‌రు కోటీశ్వరుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే క‌థ‌లో నాగ్ న‌టిస్తార‌న్న ప్రచారం జ‌రుగుతోంది. 

బాలీవుడ్‌లో తెర‌కెక్కిన స్లమ్‌డాగ్ మిలీనియ‌ర్  కూడా కౌన్ బ‌నేగా కరోడ్ ప‌తి నేప‌థ్యంలో సాగే క‌థే. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో న‌డిచే క‌థని తెలుస్తోంది. మీలో ఎవ‌రు కోటీశ్వరుడుకి కావ‌ల్సినంత ప్రచారం క‌ల్పించ‌డంతో పాటు ప‌నిలో ప‌నిగా ఓ కొత్త కాన్సెప్ తో సినిమా చేసిన‌ట్టు ఉంటుంద‌ని నాగ్ ఈ సినిమాకి ప‌చ్చజెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది