ఒక్కో సినిమా వస్తోంది రింగ్ లోకి…దాని ప్రతిభ అది చూపించి వెళ్తోంది. జనం పెదవి విరిచేస్తున్నారు. షేర్ వచ్చింది బేర్ మంది.. కంచె వచ్చింది.. ఫరావలేదు అనిపించుకుంది.. త్రిపుర వచ్చింది.. ఫట్ మంది.. అఖిల్ రిలీజ్… కిల్ అయిపోయింది. రుద్రమదేవి.. సోసో.. సైజ్ జీరో.. జీరో అయిపోయింది. దాదాపు అక్టోబర్ ఆఖరు నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు సరైన సినిమా పడలేదు. కుమారి 21ఎఫ్ వచ్చింది కానీ, ఫ్యామిలీలు చూసే సినిమా కాదని ముద్రపడింది.
జనం అంతా శంకరాభరణం కొసం చూసారు. కాస్త ఫ్యామిలీ లేదా మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుదని. కానీ ఇప్పుడు అదీ ఆశనిరాశ చేసింది. ఇక మిగిలింది బెంగాల్ మిగిలింది బరిలో. ఈ నెల 10న విడుదలకు సిద్ధం అవుతోంది. తానేమీ ప్రయోగం చేయడం లేదని, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ గీటు దాటకుండా, ప్రేక్షకులకు రూపాయికి రూపాయి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ఒక్కటే లక్ష్యంగా వెళ్తున్నానని అంటున్నాడు దర్శకుడు సంపత్ నంది.
శంకరాభరణం విడుదలకు ముందు కోనవెంకట్ భయంకరమైన కబుర్లుచెప్పారు. కానీ ఆ కబుర్లు అన్నీ వట్టివని ఇప్పుడు తేలిపోయింది. చిత్రంగా సంపత్ నంది మాత్రం లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నాడు. మరి అతగాడు అయినా సైలెంట్ హిట్ ఇస్తాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ.