థని ఒరువన్ సినిమా తెలుగు రీమేక్ పై ఏవో ఒక వార్త వినిపిస్తూనే వుంది. అప్పుడప్పుడు థని ఒరువన్ లో ప్రతినాయకుడిగా మనోజ్ లాంటి జోక్ లు కూడా కనిపిస్తున్నాయి. ఆ క్యారెక్టర్ రేంజ్ చాలా పెద్దది. దానికి మనోజ్ పేరు ఎవరు, ఎందుకు పుట్టించారో? లేదా నిర్మాతల దృష్టికి మనోజ్ పేరు వెళ్లాలని పుట్టించారో?
ప్రస్తుతానికి తాజా సమాచారం ఏమిటంటే. జనవరి ఫస్ట్ వీక్ నుంచి థని ఒరువన్ తెలుగు రీమేక్ షూటింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా అరవింద్ స్వామినే విలన్ గా నటించడానికి దాదాపు ఒప్పించేసారు. అరవింద్ నిర్మాత. హీరోయిన్ గా శృతి హాసన్ ఓ ఆప్షన్ మాత్రమే. ఇంకా ఫైనల్ కావాల్సివుంది. ఇది పూర్తయ్యే దాకా చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఉద్దేశంలో లేడని తెలుస్తోంది.