కొలంబస్..కొలంబస్..ఆరుకోట్లు మటాష్

టాలీవుడ్ లో ఎంటర్ కావాలంటే చాలా భయపడిపోయే పరిస్థితి తెస్తున్నారు. కొందరు.. కొత్తవాళ్లు ఎవరైనా కాస్త సరదా పడి సినిమాల్లోకి వస్తామంటే చాలు. బకరా దొరికాడు రా అనుకుంటున్నారు చాలా మంది. దాంతో వచ్చిన…

టాలీవుడ్ లో ఎంటర్ కావాలంటే చాలా భయపడిపోయే పరిస్థితి తెస్తున్నారు. కొందరు.. కొత్తవాళ్లు ఎవరైనా కాస్త సరదా పడి సినిమాల్లోకి వస్తామంటే చాలు. బకరా దొరికాడు రా అనుకుంటున్నారు చాలా మంది. దాంతో వచ్చిన వాడు తెచ్చిన కోట్లు ఇక్కడ పోసేసి, మళ్లీ ఇటు చూడకుండా వెళ్లిపోతున్నాడు. 

ఆ మధ్య కొలంబస్ అనే చిన్న సినిమా వచ్చింది. ఆ నిర్మాతను అలాగే కాశీ దాకా డేకించేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమంత్ అశ్విన్ లాంటి హీరోను పెట్టుకుని, ఖర్చు ఆరు కోట్లకు చేర్చేసారట. పైగా ఒక్క ప్రచారానికి కోటి పాతిక లక్షలు లాగేసారని వినికిడి. 

పైగా సినిమా విడుదలైపోయి, డిజాస్టర్ అని తేలిపోయిన తరువాత కూడా, ఇప్పుడే అసలైన పబ్లిసిటీ చేయాలి. అని చెప్పి, మరో యాభై లక్షలు ఖర్చు చేయించేసారట. ఇప్పుడు ఈ ఆరు కోట్లు గోడకు కొట్టిన సున్నం అయిపోయింది. పైగా ఈ వ్యవహారంలో సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్ ఎస్ రాజు, ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఓ మీడియా మేనేజ్ మెంట్ కంపెనీల హాండ్ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో బకరా అయిపోయిన నిర్మాతకే తెలియాలి..