థియేటర్లు ఖాళీ లేవు

అంటే థియేటర్లు హవుస్ ఫుల్ గా రన్ అవుతున్నాయని అపార్థం చేసుకోవద్దు. థియేటర్లలో ఆడుతున్న రభస, పవర్, ఆగడు, ఇంకా…చిన్నా చితకా సినిమాల కలెక్షన్లు అన్నీఅంతంత మాత్రం గానే వున్నాయి. అయితే అలా అని…

అంటే థియేటర్లు హవుస్ ఫుల్ గా రన్ అవుతున్నాయని అపార్థం చేసుకోవద్దు. థియేటర్లలో ఆడుతున్న రభస, పవర్, ఆగడు, ఇంకా…చిన్నా చితకా సినిమాల కలెక్షన్లు అన్నీఅంతంత మాత్రం గానే వున్నాయి. అయితే అలా అని థియేటర్లను మాత్రం వదిలి వెళ్లడం లేదు. దాంతో కొత్త సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చి పడుతోంది. ఇలాంటి సమయంలో గోవిందుడు అందరి వాడేలే సినిమా వస్తోంది. దాంతో మిగిలిన అర కొర థియేటర్లు కూడా ఫిల్ అయిపోతున్నాయి.

ఇది మీడియం రేంజ్ సినిమాలకు ఇబ్బందిగా వుంది. దిక్కులు చూడకు రామయ్యా, కరెంటుతీగ సినిమాలు అన్ని విధాలా రెడీగా వున్నాయి. 3న విడుదల చేద్దామని నిర్మాతలు అనుకుంటున్నా, సరిపడా థియేటర్లు దొరకక, ఆలోచనలో పడ్డారట. కరెంటు తీగ 10న వద్దామని అనుకుంటోంది. దిక్కులు చూడకు రామయ్యా ఎలాగైనా 3నే రావాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క కార్తికేయ 10న రావాలని చూస్తున్నాడు. ఇంకా లైలా వుండనే వుంది.

అక్టొబర్ రెండో వారం దాటితే కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. కానీ ప్రేక్షకుల పండగ మూడ్ మారిపోతుంది కదా.