మహేశ్ బాబూ… మీరు చెప్పుల యాడ్ లోనా…!

ఒకనాడు యూత్ కు ఐకాన్ గా నిలిచిన నటుడు అబ్బాస్. ప్రేమదేశం రిలీజైన తర్వాత అబ్బాస్ ఒక క్రేజీ స్టార్ అయ్యాడు. అతడు, అతడి పర్సనాలిటీ, స్టైల్ …. యూత్ ను తెగ ఆకట్టుకొన్నాయి.…

ఒకనాడు యూత్ కు ఐకాన్ గా నిలిచిన నటుడు అబ్బాస్. ప్రేమదేశం రిలీజైన తర్వాత అబ్బాస్ ఒక క్రేజీ స్టార్ అయ్యాడు. అతడు, అతడి పర్సనాలిటీ, స్టైల్ …. యూత్ ను తెగ ఆకట్టుకొన్నాయి. అందులోనూ ప్రేమదేశం వంటి యూత్ రిలేటెడ్ మూవీలో అబ్బాస్ కనిపించిన తీరును చూసి సౌతిండియా మొత్తం అతడి క్రేజ్ లో పడిపోయింది. అతడిని క్రేజీ స్టార్ గా గుర్తించింది. ఆ తర్వాత కూడా అబ్బాస్ చాలా సినిమాల్లో నటించాడు. ప్లేబాయ్ తరహా రోల్స్ లోనూ కనిపించాడు. అయితే అవేవీ అంత హిట్ కాకపోవడంతో అబ్బాస్ కెరీర్ మందగమనంలోపడిపోయింది. 

కట్ చేస్తే.. ఇప్పుడు అబ్బాస్ మరో విధంగా జనాలకు ఐడెంటిఫై అవుతున్నాడు. ఏదో టాయ్ లెట్ క్లీనింగ్ యాడ్ లో కనిపిస్తున్నాడాయన. రెండు మూడేళ్లుగా అబ్బాస్ ఈ యాడ్ చేస్తున్నాడు. ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ సందర్భంగా అబ్బాస్ ను చాలా క్రియేటివ్ గా చూపిస్తున్నారు. ఈ మధ్యనే డబుల్ యాక్షన్ పోజులో కూడా చూపించారు అలనాటి ఈ క్రేజీ హీరోని! టాయ్ లెట్ కి ఒక అబ్బాస్…బాత్ రూమ్ కి ఇంకో అబ్బాస్ అనమాట. మరి టైమ్ బాలేకపోతే… ఇలానే ఉంటుంది. కెరీర్ లో చెప్పుకోదగినది ఒకే సూపర్ హిట్ కావడంతో.. అబ్బాస్ పరిస్థితి ఇలా మారిందని చెప్పవచ్చు. మరి సినిమా అవకాశాలు లేకపోయినా… ఇలాంటి యాడ్స్ లో నటిస్తూ బండిని లాగిస్తున్న అబ్బాస్ లోని ఆశావాదిని మనం గుర్తించవచ్చు. అయితే ఒకప్పుడు ఇతడిని డ్రీమ్ బాయ్ గా చూసుకొన్న అమ్మాయిలు… ఇప్పటియాడ్స్ ను చూసి మాత్రం భరించలేకపోతున్నారు!

మరి అబ్బాస్ సంగతి అలా ఉంటే.. మహేశ్ బాబు కథ మరోటి. తెలుగు స్టార్ హీరోల్లో ఎక్కువ బ్రాండ్స్ ఎండార్స్ చేస్తున్న హీరోగా.. తద్వారా భారీ మొత్తాన్ని సంపాదించుకొంటున్న హీరోగా మహేశ్ కొత్త రికార్డులను స్థాపించాడు. హిందీ యాడ్స్ లో కూడా కనిపించి తనకున్న ఛరిష్మా ను మహేశ్ చాటుకొన్నాడు. మరి మహేశ్ కనిపించేది… థమ్సప్ యాడ్ లో అయితే జోష్ ఫుల్ గా.. మహీంద్రా ట్రాక్టర్ యాడ్ లో అయితే స్ట్రెంగ్తీగా.. బంగారు నగల కంపెనీ యాడ్ అయితే కలర్ పుల్ గా.. రాయల్ స్టాగ్ యాడ్ లో అయితే ఛీర్ ఫుల్ గా ఉంటుంది… కానీ మహేశ్ ఇప్పుడు చెప్పుల కంపెనీ యాడ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికీ మహేశ్ బాబు  లక్షలాది మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్.. వారి కోణం నుంచి చూసినట్టు అయితే… ఈ చెప్పులకంపెనీ యాడ్ అంత తేలికగా డైజెస్ట్ అయ్యే విషయం కాదు.

ఒక రేంజ్ లో ఊహించుకొనే వారిని.. మరో రేంజ్ లో చూడటం కష్టమే కదా. బాలీవుడ్ కే సూపర్ స్టార్ గా కొన్ని దశాబ్దాలు వెలిగిన అమితాబ్ బచ్చన్ గజ్జి, తామర లను నివారించే ఒక లోషన్ ను ప్రమోట్ చేశాడు.. ఒంటిచేత్తో ఫైట్ లను చేసి… తన వాయిస్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆయనను అలాంటియాడ్ లో చూడాల్సి రావడం అభిమానుల దురదృష్టం.  మరి ఈ స్టార్ లు తమ అభిమానులను దృష్టిలో పెట్టుకొని అయినా… ఎండార్స్ మెంట్ విషయంలో కొంత ఆలోచిస్తే బాగుంటుంది.