హీరో కృష్ణ కు వున్న ఫ్యాన్ బేస్ ఇంతా అంతా కాదు. డై హార్డ్ ఫ్యాన్స్ వారంతా. అదే ఫ్యాన్ బేస్ మహేష్ కు వారసత్వంగా వచ్చింది. ఈ ఫ్యాన్స్ అంటే అల్లాటప్పా ఫ్యాన్స్ కాదు. కృష్ణగారు సినిమాల్లో నటించకపోయినా, ఇప్పటికీ ఆయన రికార్డులు, బర్త్ డేలు అన్నీ వారు చూస్తూనే వుంటారు. చేస్తూనే వుంటారు. అలాగే మహేష్ బాబుకు కూడా.
ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్స్ ను మహేష్ కు డీలింక్ చేయాలని నిర్మాత అనిల్ సుంకర చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి దారితీసిన సంఘటన ఆసక్తికరంగావుంది. ఆగడు సినిమా ఫ్లాప్ తరువాత కృష్ణ, మహేష్ ఫ్యాన్ ల్లో కీలక వ్యక్తి ఒకరు ట్విట్టర్ లో నైజాం కలెక్షన్లపై సమాచారం అందించారట. దీనిపై అనిల్ సుంకరకు, ఆ అభిమానికి వాదన జరిగినట్లు తెలుస్తోంది.
దాంతో అనిల్ సుంకర ఈ విషయాన్ని మహేష్ కు ఫిర్యాదు చేసినట్లు బోగట్టా. దాంతో వారికి కొంతకాలం నో ఎంట్రీ బోర్డు పెట్టారని అంటున్నారు. పైగా మహేష్ కోసం ఆయన అభిమానులు నడిపే వెబ్ సైట్ కు పొటీగా మరో వెబ్ సైట్ నడిపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా మహేష్ అభిమానుల్లో చీలిక తేవాలని చూస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. ఇదే నిజమైతే కాస్త ఇబ్బందే. సినిమా విజయంలో, మౌత్ టాక్ ప్రచారంలో అభిమానులదే కీలకపాత్ర కదా.