నిఖిల్ ఛలో వియత్నాం

సక్సెస్ ను సెలవులను ఒకేసారి ఎంజాయ్ చేస్తున్నాడు హీరో నిఖిల్. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా కూడా సూర్య వెర్సస్ సూర్య బాగానే పే చేయడంతో నిఖిల్ వైపు తిరిగాయి చాలా నిర్మాతల కళ్లు.…

సక్సెస్ ను సెలవులను ఒకేసారి ఎంజాయ్ చేస్తున్నాడు హీరో నిఖిల్. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా కూడా సూర్య వెర్సస్ సూర్య బాగానే పే చేయడంతో నిఖిల్ వైపు తిరిగాయి చాలా నిర్మాతల కళ్లు. అయితే చాలా ఛూజీగా వున్నాడు నిఖిల్. సబ్జెక్ట్ ల విషయంలో కాదు, నిర్మాతల విషయంలో కూడా. 

పెద్ద పెద్ద బ్యానర్ ల నుంచి ఆఫర్ లు వస్తున్నా, ఇప్పటికి ఇద్దరికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి కోన వెంకట్ కి. రెండవది శర్మ అనే కొత్త నిర్మాతకు. ఈ నిర్మాత నెల్లూరు, చెన్నయ్ ప్రాంతాల్లోవ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సినిమా సబ్జెక్ట్, టెక్నీషియన్ల విషయంలో నిర్ణయం నిఖిల్ కే వదిలేసారట. సుధీర్ వర్మ మూడొ సినిమా నిఖల్ తో చేయాలనుకుంటున్నాడు. 

చందు మొండేటి మూడో సినిమా కూడా నిఖిల్ తోనే. పైగా కార్తీక్ (సూర్ వెర్సర్ సూర్య) వీళ్లకి ఫొటోగ్రాఫర్ గా కొనసాగుతాడు. ఈ యంగ్ టీమ్ కొత్త సబ్జెక్ట్ ల కోసం చూస్తోంది. సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ గా వుంటే తప్ప, ఓకె అనకూడదన్నది నిఖిల్ ప్రాధమిక సూత్రం.

ఇదిలా వుంటే మొన్ననే తన టీమ్ ను తీసుకుని మకావ్ వెళ్లి వచ్చిన నిఖిల్ ఇప్పుడు వియత్నాం, ఆ పరిసర  దేశాలు చుట్టేయడానికి వెళ్తున్నాడు. ట్రెక్కింగ్, అడ్వంచరస్ టూరిజం కోసం అంట. కొత్త సబ్జెక్ట్ లు రెడీ అయ్యే లోగా ఇలా రౌండ్లు వేసి వస్తాడన్నమాట.