ప్రేమ పేరిట మరో పాశవిక చర్య

‘‘ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయింది.. ప్రయాణీకులందరూ చచ్చిపోయారు.’’ అంటూ శ్రీమతి గారి బ్రేకింగ్ న్యూస్.. రాత్రి ఎనిమిదింటికి ఇంట్లోకి అడుగుపెడుతుండగా.. మరో గంటకి జర్నలిస్టు మిత్రుడు వీఎస్‌ఎన్ మూర్తి ఫోన్.. Advertisement ఇది పైలెట్…

‘‘ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయింది.. ప్రయాణీకులందరూ చచ్చిపోయారు.’’ అంటూ శ్రీమతి గారి బ్రేకింగ్ న్యూస్.. రాత్రి ఎనిమిదింటికి ఇంట్లోకి అడుగుపెడుతుండగా.. మరో గంటకి జర్నలిస్టు మిత్రుడు వీఎస్‌ఎన్ మూర్తి ఫోన్..

ఇది పైలెట్ నిర్లక్ష్యమే.. సాంకేతిక లోపం కాదు… కావాలని చేసిందే. ఈ దుర్ఘటనకు మానసిక స్థితే కారణమేమో! కాస్త రిసెర్చ్ చేసి మనోవిశ్లేషణతో  ఈ క్రాస్‌కి నేపథ్యాలైన క్లాషెస్‌ని జల్లెడ ప్టండీ అంటూ. ఇంకా జల్లెడ కోసం ప్రయత్నించక పూర్వమే నా మనోపలకం నుండి కళ్లముందు ఓ దృశ్యం కదలాడ సాగింది… దూసుకొస్తున్న విమానంలో ఒకే ఒక పైలెట్… వివరణమవుతున్న ముఖకవలికలు… ఇంతలో స్థిర చిత్తంతో చేతి కదలికలు… ఆకాశమార్గాన ముందుకు దూసుకొస్తున్న విమానం అంత ఎత్తులనుండి ఏ కొండపైనో ల్యాండ్ అయ్యేలా దూసుకుంటూ దిగుతున్న ఫీలింగ్… స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు… ఉన్నట్లుండి పర్వతాల మధ్య కనుమరుగైన విమానం… క్షణాల్లో కళ్లముందు కూలిన విమానం… చెల్లాచెదురుగా విమానం విడిభాగాలు… కొన్ని మానవ మృతదేహాలు. ఓహ్.. గగుర్పొడిచే దృశ్యం… టెరిఫైయింగ్ సినారియో! 

నిజంగానే మూర్తి అన్నట్లు ఇది నిజంగా సాంకేతిక లోపం కాదేమో?! ప్రకృతి పరిహసించడంతో జరిగిన దర్ఘటనా కాదేమో! మానవ మనస్థత్వం వికటిస్తే క్షణాల్లో వందకు పైగా ప్రాణాలు మానవ దేహం నుండి నిష్ర్కమించినట్లే. వారి చుట్టూ బంధాలు ముడిపడినా కొన్ని వేల మంది మానసిక క్షోభకు కారణమైన పైలెట్ మనస్తత్వాన్ని ఏమనుకోవాలి? కొన్ని కోట్ల మందిని భయబ్రాంతులకు గురిచేసిన ఆ చోదకుని ఏమనాలి? ఇటువంటి పైలెట్‌ల వల్లనే కదా పైలెట్ అని అనిపించుకుంటున్న ప్రతి ఒక్కరిపైనా మచ్చ పడుతోంది. మనం ‘‘మనం మానవాకారంతో జీవిస్తున్నందుకు ఈ భూమికు చెల్లించాల్సిన అద్దె ఇతరులకు సేవచేయడమే’’ అని మహమ్మద్ అలీ అంటుంటే మరి ఈ పైలెట్ చేసిన సేవ ఏమిటి? 150 మందిని మృత్యు కౌగిటిలోకి చేర్చిన పైలెట్. ఏ నరకంలో స్థిర నివాసం కల్పించాలి? 

‘‘వెరీ లిటిల్ ఈజ్ నీడెడ్ టు మేక్ ఎ హ్యాపీ లైఫ్, ఇట్ ఈజ్ ఆల్ వితిన్ యువర్ సెల్ఫ్, ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్’’ అని అంటాడు మార్కస్ అరేలియస్. అవును కడివెడు పాలవంటి ఆనందమయ జీవితం తోడుకావడానికి కావల్సింది ఇసుమంత మజ్జిగ వంటి విచక్షణనే. ఇంతకూ ఈ విచక్షణను మన వ్యక్తిత్వం నుంచి తోడుకోవాల్సిదే. మన ఆలోచనలను చిలికితేనే ఆతోడు దొరికేది. సమాజంలో తోడు లేనపడు మరి జీవితం ఒంటిరిదేగా! ఆ ఒంటరితనమే అనేక వేదనలకు మూలమవుతుంటుంది. ఆ ఒంటరితనమే జీవితాన్ని అనేక బాధలకు నిలయంగా మార్చి వేదిస్తుంటుంది… వదిస్తుంటుంది. పర్యవసానమే ఆత్మ హత్యోతలంపు. 

ఓ మై గాడ్! అంటే ఈ పైలెట్ కూడా ఆత్మహత్యో తలంపుతోనే ఈ క్రాస్ కి ఒడిగట్టి ఉంటాడా?! అవును, 150 మంది ప్రయాణిస్తున్న జర్మన్ వింగ్స్ ఎయిర్‌బస్‌ను ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలపాలుచేసిన 27 ఏళ్ల ఆండ్రియా లూబిజ్ ‘తీవ్ర అనారోగ్యం’తో ఉన్నట్లు కొన్ని వాదనలు… సివియర్లీ డిప్రెస్ట్ అనీ మరికొన్ని వార్తలు… ఆత్మహత్య అని కొందరు అంటుంటే మాస్ మర్డర్ అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఇది ప్రమాదం వల్ల సంభవించింది కాదు కాబట్టి కిరాతక చర్య అని చాలా మంది అంటున్నారు. చివరికి మెడికల్ రిపోర్టు ప్రకారం ఈ కో పైలెట్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు… అది శారీరక అనారోగ్యం కాదని మానసిక అనారోగ్యమేనని. ఇంతకీ ఈ డిప్రెషన్‌కి, మానసిక అస్వస్థతకు కారణం ఏమై ఉంటుందా అంటే ‘ప్రియురాలితో పొసగని సంంధ బాంధవ్యాలే కారణం’ అన్నది ఒక కోణం. ఇదే అతడి డిప్రెషన్‌కి మూలకారణం.

‘కమిటింగ్ సూసైడ్’, ‘మాస్ మర్డర్’లు కొన్ని వేల మంది ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చాల్సిన పైలెట్ వశమైతే ఎలా?

అన్నట్టు, కో పైలెట్ లూబిజ్ తన ప్రియురాలితో తాను కలకాలం గుర్తుండిపోయేలా ఒక దారుణ, దృష్ట చర్యకు పాల్పడుతున్నానని చెప్పినట్లు ఒక కథనం. అంటే, తాను కన్న కళలు సాకరం కాలేకపోవటమే ఈ దృష్ట చర్యకు మూలం. ఆ కారణంగానే అతడిలో అస్థిరత్వం.

‘‘మొత్తం సిస్టమ్ మార్చే విధంగా నేనేదో చేయబోతున్నాను. దాంతో అందరికీ నా పేరు తెలుస్తుంది. అందరూ నన్ను గుర్తించుకుంటారు’’. అని బాబిజ్ ప్రియురాలితో అన్న మాటలు. 

వీటన్నింటిని బట్టి అతను ఇటువంటి దుర్ఘటనకు ఎప్పటినుండో ప్లాన్ వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతే తప్ప ఏ రాజకీయ, మత కారణము కనిపించటంలేదు. తాను ఆత్మహత్యకు పాల్పడ్డానికి కారణాన్ని తెలిపే ఎటువంటి సూసైడ్ నోట్ ఎక్కడా దొరకలేదు. మొత్తానికి 630 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం, ఎటువంటి టెర్రరిజం బ్యాగ్రౌండ్ ఉందని అనుమానించ వీలులేని పైలెట్. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ అన్నవి తన ఆత్మహత్యకు 150 మంది మూకుమ్మడి హత్యకు మూలమన్నది మాత్రం స్పష్టం. 

సెక్సస్ ఈజ్ సెల్ఫిస్‌నెస్ అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. అవును, స్వార్ధానికి పరాకాష్ట ఆత్మహత్యనే. తాను మరణిస్తూ తన చుట్టూ వున్నవారిని హతమార్చటం అన్నది పరాకాష్టకు జతకలిసిన పాశవిక చర్య. ఒక అపజయం, ఒక దీర్ఘకాలిక సంఘర్షణ ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణం కావచ్చు. అయితే సదరు వ్యక్తి తను ఆత్మ హత్య చేసుకుంటూ మరికొందరిని బలిపశువులను చేయడం పాశవిక, కిరాతక చర్యనే. 

గత 50 ఏళ్లలో పైలెట్‌లు విమానాలు నడుపుతూ ఆత్మహత్యతో ప్రాణాలు వదలడం ఈ జర్మన్ వింగ్స్ ఉదంతంతో ఓ పదో సంఘటన అయివుండవచ్చు. అసలు ఆత్మహత్య అనేది జీవితంలో తీసుకునే అసంబద్ధ దారుణ నిర్ణయమని మన అందరికీ తెలిసిందే. 

  1. ఒక వ్యక్తి కోసం ప్రేమ వైఫల్యం పేరిట ఎంత ఉన్నత శిఖరాలను చేరుకోవాల్సిన జీవితాన్ని పరిసమాప్తి చేసుకోవడం విజ్ఞత కాదు. ఎండ్ లెస్ ట్రబుల్స్ మే ఎరైజ్ బట్ స్టిల్ వుయ్ సోల్డ్ నో హౌ టు గో ఆన్ ఇన్ అవర్ లీవ్స్ ఎహెడ్!
  2. జీవితంలో ఏమరుపాటుగా ఉంటే ఎలా? జీవితం జీవించడానికే తప్ప ప్రమాదం పాలుచేయడానికి కాదు. జీవితం అంటే ఒక టీమ్ స్పిరిట్… అర్దవంతంగా మన ముందుకు సాగిపోతుండడం. అంతే కాని వైఫల్యాల పేరిట ఆత్మహత్యకు పాల్పడటం కాదు. 
  3. ఎంతో సృష్టి పరిణామమం కారణంగానే మన మానవ జన్మ సాధ్యమవుతోంది. అటువంటి మానవ జన్మను సార్ధకం చేసుకోవల్సిన బాధ్యత జీవితంపైన ఉంది. మనం పైకి వ్యక్తులమే కాని వ్యక్తిత్వ, వ్యక్తిమత్వ సంపన్నులం. అంతే కాని ఆత్మహత్యకు దారితీసేందుకు ఉద్దేశించింది కాదు ఈ సంయోగ జీవితం.
  4. మనం ఒంటరిగానే భూమి మీదకు వచ్చాం… అనేక బాంధవ్యాల మధ్య ఊపిరి పోసుకుంటూ పెరుగుతున్నాం. మన పెరుగుదలకు ఎందరెందరో కారణమవుతున్నారు. వారందరి ప్రేమను కాదని కేవలం ఏ ఒక్క వృత్తితో ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యనా? ఎప్పటికీ ఆలోచన బలహీనపడి ఆత్మహత్య దిశగా సాగకూడదు. 
  5. మాటరాని వాళ్లను చూస్తున్నాం… చూపులేనివాళ్లను చూస్తున్నాం… కాళ్లుచేతులు లేని వాళ్లను చూస్తున్నాం… అవయవ లోపాలతో ఎంతమంది లేరు? మానసిక చైతన్యం లేకపోయినా ధైర్యంగా ఉంటున్న వారికి ఎందరిని చూడడంలేదూ! వారందరూ తమ అవిటితనం కారణంగా, అంగవైకల్యం కారణంగా ఆత్మహత్య చేసుకోవడం లేదే. పోనీ అయినవారు వారిని బరువుగా భావించక బాధ్యతగా పెంచుతున్నారే. కాబట్టి కేవలం ఒక వ్యక్తి ప్రేమను కాదన్న కారణాన ఆత్మహత్యకు పాల్పడటం తగదు కాక తగదు. 
  6. పేదరికంతో ఆకలిమంట ఎగస్తున్నా జీవిస్తున్నవారిని చూస్తున్నాం. కులం పేరిట, వర్గం పేరిట చిన్నచూపుకు గురవుతున్న వారూ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆత్మహత్యకు పాల్పడ్డం కాదు. హౌ టు లీవ్ ఏ మోర్ ఎగ్జయిటింగ్, మోర్ సూటబుల్ ఫర్ యు అన్నది తెలుసుకుని ముందుకు సాగటం ముఖ్యం. 
  7. వైఫల్యం కారణంగా మనం వెతుక్కోవాల్సింది మరణించడానికి మార్గాలను కాదు… జీవన గమ్యాలను నిర్ధేశించుకోవాలి. 
  8. ప్రేమ వైఫల్యం అనే కాదు… ఏ వైఫల్యం నుండి బయటపడ్డానికైనా పరిష్కార మార్గం ఉంది… కాబట్టి ఆత్మహత్య అన్న ఆలోచనతో సమస్యల సుడిగుండంలో పడటం కాదు… పరిష్కారాల మెట్లు ఎక్కుతూ జీవన అందలాలను చేరుకోవాలి.

డాక్టర్ వాసిలి వసంత్ కుమార్
9393933946