తమిళ తంబిల సినిమా పోరు

మన తెలుగు సినిమా జనాలు ఆచి తూచి సినిమాలు వదులుతున్నారు. ఒక వారం ఒక పెద్ద సినిమా, అది కూడా వీలయితే మధ్యలో వారం గ్యాప్ ఇలా అన్నీ చూసుకుంటున్నారు. కానీ తమిళ తంబిలు…

మన తెలుగు సినిమా జనాలు ఆచి తూచి సినిమాలు వదులుతున్నారు. ఒక వారం ఒక పెద్ద సినిమా, అది కూడా వీలయితే మధ్యలో వారం గ్యాప్ ఇలా అన్నీ చూసుకుంటున్నారు. కానీ తమిళ తంబిలు ఒకేసారి తమ సినిమాల విడుదలకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. 

తరువాత వాయిదా వేస్తారో, వేయరో కానీ ప్రస్తుతానికి ఈ నెల 17 తేదీన మూడు తమిళ డబ్బింగ్ సినిమాలు విడదలవుతాయని సమచారం. మణిరత్నం ‘ఓకే బంగారం’. కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ వీటిలో వున్నాయి. ఇక రెండు సార్లు తెలుగునాట కూడా బాగా డబ్బులు చేసుకున్న కాంచన సినిమా మూడో సీక్వెల్ కూడా అదే రోజున విడుదల చేయాలని చూస్తున్నారట.  

అసలే 9న సత్యమూర్తి విడుదల వుంది. థియేటర్లు ఫుల్. మరి 17 మూడు సినిమాలకు థియేటర్లు కావాలి..మళ్లీ వారంలో దోచేయ్ విడుదలవుతంది. దానికీ థియేటర్లు కావాలి. ఎలా సర్దుబాటు చేస్తారో. ఫ్లాపులు ఎక్కువ వుంటే తప్ప, లేకుంటే ఇబ్బందే.