కలెక్షన్లు బాగున్నాయంట

అవును సినిమాకు వచ్చిన క్రేజ్ తక్కువేమీ కాదు. పైగా టీవీలో లెక్కలేనన్ని సార్లు వచ్చింది. నిర్మాత తో సమానంగా శాటిలైట్ హక్కులుకొన్ని మా టీవీ కూడా డబ్బులు చేసుకుంది. ఇప్పుడు ఆ క్రేజ్ అవును…

అవును సినిమాకు వచ్చిన క్రేజ్ తక్కువేమీ కాదు. పైగా టీవీలో లెక్కలేనన్ని సార్లు వచ్చింది. నిర్మాత తో సమానంగా శాటిలైట్ హక్కులుకొన్ని మా టీవీ కూడా డబ్బులు చేసుకుంది. ఇప్పుడు ఆ క్రేజ్ అవును 2 కు బాగానే పనికి వచ్చినట్లుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగున్నయట. సినిమాను మొదట్నీంచీ ఎ సెంటర్ మూవీ అనుకున్నారు. కానీ బి సి ల్లో కూడా తొలి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. 

అయితే సినిమాకు మిక్స్ డ్ సమీక్షలు రావడం పట్ల దర్శకుడు రవిబాబు కాస్త అసంతృప్తికి గురయ్యాడని వినికిడి. కాస్తో, కూస్తో డిఫరెంట్ గా తీయాలని ప్రయత్నించేవారిని కూడా ఇలా నిరుత్సాహపరిస్తే ఎలా అని అన్నాడట. సమీక్షలు ఎలా వుంటేనేం..కలెక్షన్లు బాగున్నాయి, జనాలకు నచ్చింది చాలు కదా అని సురేష్ బాబు అన్నట్లు బోగట్టా.

నిజానికి రవిబాబు మంచి టెక్నీషియన్. అందులో సందేహం లేదు. ఎటొచ్చీ సీక్వెల్  లేదా పార్ట్ టు కావడం వల్ల జనాలకు కాస్త కొత్తదనం లేనట్లు అనిపించింది. ఇది కాక, మరో కథతో ప్రయోగం చేసి వుంటే కచ్చితంగా మెచ్చుకునేవారే.