ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లోకి వచ్చేసింది హేమ. ఇప్పటికీ మాంచి హుషారుగా నటిస్తోంది. తెలుగు తెరకు ఇప్పుడు ఏకైక లేడీ కమెడియన్. కేవలం ఏక్టింగ్ తో ఊరుకోకుండా ఆ మధ్య రాజకీయాల్లోకి వచ్చింది. ఈ మధ్య మా ఎన్నికల సందర్భంగా మాటల తూటాలు విసిరి వార్తల్లోకి వచ్చింది.
ఇప్పుడు స్టూడియో నిర్మాతగా మారబోతోంది. తన ప్రాంతమైన అమలాపురం-రాజోలు దగ్గర భూములు సేకరించి, స్టూడియో కడుతుందట. ఇప్పుడు అదే పనిమీద అక్కడ తెగ హల్ చల్ చేస్తోంది. మంచి అయిడియానే. మన సినిమాల షూటింగ్ లు ఈస్ట్ గోదావరిలో బాగానే జరుగుతాయి. కానీ అభిమానుల జనం తాకిడి ఎక్కువగా వుంటుందని సినిమా జనం జంకుతారు.
ఇప్పుడు అలాంటి చోట స్టూడియో కడితే బిజినెస్ బాగానే వుంటుంది. అంటే మొత్తానికి హేమ దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టేస్తోందన్నమాట.