అనుష్కకి గుడి కడుతున్న రాజశేఖర్‌

అనుక్షణం తన ‘జీవిత’ భాగస్వామిని వెంటపెట్టుకుని తిరిగే డాక్టర్‌ రాజశేఖర్‌, నటి అనుష్కకి గుడి కట్టడం ఏమిటని అనుకోకండి. ఇదంతా సినిమా కోసం చేస్తున్నదే తప్ప నిజంగా అనుష్కకి గుడి కట్టించే ప్రోగ్రామ్స్‌ ఏమీ…

అనుక్షణం తన ‘జీవిత’ భాగస్వామిని వెంటపెట్టుకుని తిరిగే డాక్టర్‌ రాజశేఖర్‌, నటి అనుష్కకి గుడి కట్టడం ఏమిటని అనుకోకండి. ఇదంతా సినిమా కోసం చేస్తున్నదే తప్ప నిజంగా అనుష్కకి గుడి కట్టించే ప్రోగ్రామ్స్‌ ఏమీ పెట్టుకోలేదు. ‘గడ్డం గ్యాంగ్‌’ చిత్రంలో అనుష్కకి వీరాభిమానిగా రాజశేఖర్‌ కనిపిస్తారట.

తన అభిమాన నటి విగ్రహం చేయించి, గుడి కట్టించే సీన్‌ ఒకటి ఈ సినిమాలో ఉందట. ఈ చిత్రం తమిళ మాతృక అయిన సూదుకవ్వం చిత్రంలో హీరో నయనతార అభిమానిగా కనిపిస్తాడు. తెలుగునాట నయనతార కంటే అనుష్క పాపులర్‌ కనుక ఆమె అభిమానిగా రాజశేఖర్‌ నటిస్తున్నాడు. 

కొంతకాలంగా విజయాలు లేని రాజశేఖర్‌ గడ్డం గ్యాంగ్‌ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని స్వయంగా అతనే నిర్మిస్తున్నాడు. తనకి దక్కకుండా పోతున్న విజయాన్ని ఈ చిత్రం అందిస్తుందనే ధీమా రాజశేఖర్‌ వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా బిజినెస్‌ క్లోజ్‌ కాని ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసే సన్నాహాలు చేసుకుంటున్నారు.