ఈవారంలోనే రిలీజ్ ఉంటుందని ‘గోపాల గోపాల’ గురించి అనధికార వార్తలు వస్తూనే ఉన్నాయి. 9న రావడం కుదర్లేదు కాబట్టి 10న రిలీజ్ ఖాయమని అనుకున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు సెన్సార్ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ రోజు సెన్సార్ జరగలేదు. రేపే సెన్సార్ జరుగుతుందని సమాచారం.
సో… జనవరి 10న రిలీజ్ అనేది కూడా అవుటాఫ్ క్వశ్చన్. రేపు కనుక అనుకున్న ప్రకారం సెన్సార్ అయినట్టయితే 11న రిలీజ్ అవుతుంది. అయితే ఆదివారం రిలీజ్ చేయడమేంటని పవన్‌కళ్యాణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ రోజు ఉండే అడ్వాంటేజ్‌కి తొలి ఆదివారం వసూళ్లు యాడ్ అయి ఫస్ట్ వీకెండ్ వరకు పెద్ద సినిమాలకి ఢోకా ఉండదు.
అలాంటిది ఆదివారమే రిలీజ్ చేస్తే… ఇటు ఇక్కడ ఉండే బెనిఫిట్‌కి తోడు యుఎస్‌లోను ఈ చిత్రం తీవ్రంగా నష్టపోతుంది. శనివారం రిలీజ్ చేసినట్టయితే శుక్రవారం ప్రీమియర్స్ వేసుకుని బాగా లాభపడవచ్చు. కానీ ఆదివారం రిలీజ్ అంటే… శుక్రవారం వసూళ్లని పూర్తిగా కోల్పోవాలి. నెక్స్‌ట్ వీక్‌కి ఎలాగో ‘ఐ’ ఫీవర్ ఉంటుంది కాబట్టి ‘గోపాల గోపాల’కి డ్యామేజ్ జరుగుతుంది.
అసలిదంతా పక్కన పెడితే ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదని ఫాన్స్ సురేష్ ప్రొడక్షన్స్‌పై ఫైర్ అవుతున్నారు. అనివార్య పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ముందుకి జరిపిన నిర్మాతలు సకాలంలో విడుదల చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు.