అల్లు అరవింద్ చిన్న సినిమాలు

జనవరి చివర్న లేదా ఫిబ్రవరిలో అల్లు అరవింద్ నిర్మాణం లేదా భాగస్వామ్యం నుంచి ఏకంగా మూడు చిన్న సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. అల్లుఅరవింద్ ఇప్పుడు పూర్తిగా చిన్న సినిమాలపై దృష్టి పెట్టారు.  Advertisement దాదాపు…

జనవరి చివర్న లేదా ఫిబ్రవరిలో అల్లు అరవింద్ నిర్మాణం లేదా భాగస్వామ్యం నుంచి ఏకంగా మూడు చిన్న సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. అల్లుఅరవింద్ ఇప్పుడు పూర్తిగా చిన్న సినిమాలపై దృష్టి పెట్టారు. 

దాదాపు రెండు నెలలుగా అదే పనిపై వున్నారు. దాదాపు అరడజను ప్రాజెక్టులను ఓకె చేసినట్లు తెలుస్తోంది. వీటిలో మూడు వరకు వచ్చే ఒకటి రెండు నెలల్లో ప్రారంభమవుతాయి. వీటిలో ఒకటి మారుతి దర్శకత్వలో యువి క్రియేషన్స్ భాగస్వామ్యంలో వుంటుంది. 

మరోటి టీవీలో పాపులర్ అయిన ప్రభాకర్ దర్శకత్వంలో వుంటుంది. ఇంకొకటి అల్లు శిరీష్-పరుశురామ్ కాంబినేషన్ లో వుండొచ్చు.  అదే విధంగా అల్లు శిరీష్ తో కొత్త దర్శకుడి చిత్రం కూడా ప్లాన్ లో వుంది.