అల్లరి నరేష్ 50 వ సినిమా ఎవరితో?

పన్నెండేళ్ల కాలంలో యాభై సినిమాలు చేసిన ఘనత దక్కించుకున్న ఈ జనరేషన్ నటుడు అల్లరి నరేష్. బందిపోటు 49 వ సినిమా. ఇక యాభయ్యవ సినిమా వుంది. దానికి డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా…

పన్నెండేళ్ల కాలంలో యాభై సినిమాలు చేసిన ఘనత దక్కించుకున్న ఈ జనరేషన్ నటుడు అల్లరి నరేష్. బందిపోటు 49 వ సినిమా. ఇక యాభయ్యవ సినిమా వుంది. దానికి డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ మధ్య భీమినేని పేరు వినిపించింది. కానీ ఇప్పుడు భీమినేని తన సుందర పాండ్యన్ ను భుజాన వేసుకుని, బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లాడు. 

ఈ సినిమా నిజంగా భేతాళుడు..భీమినేని పట్టువదలని విక్రమార్కుడూనూ. అడగని హీరో లేడు చేయమని. సునీల్, మంచు ఫ్యామిలీ నుంచి రవితేజ వరకు. చివర్న అల్లరి నరేష్ ను కూడా ఓ మాట అడిగాడట యాభయ్యవ సినిమాగా చేయమని. అందరూ కాదన్న తరువాత తన దగ్గరకు రావడం ఏమిటి? ముందు వస్తే అది వేరే సంగతి అని అనేసాడు నరేష్ అని వినికిడి. 

సరే మొత్తానికి భీమినేని యాభయ్యవ సినిమాచేసే అవకాశాలు తగ్గాయి. ఇక మరి ఎవరున్నారు? యాభయ్యవ సినిమా కాబట్టి కాస్త మంచి డైరక్టర్ తో చేయాలని వుంది కానీ ఎవరన్నదే ఇంకా తేలడం లేదు. పైగా పెద్ద డైరక్టర్లు ఎప్పడూ అల్లరి నరేష్ కు అచ్చిరాలేదు. బాపు, విశ్వనాధ్, వంశీ ట్రయ్ చేసి ఫ్లాపులే ఇచ్చారు. అందువల్ల మీడియం రేంజ్ లో కాస్త మంచి పేరున్న దర్శకుడు అయితే బెటర్. అది ఎవరన్నది తేలాల్సి వుంది. 49వ సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో త్వరలో విడుదల కాబోతోంది.