బికినీలో రచ్చ రచ్చ

నడి ముప్పయ్‌ల్లో ఉన్నా కానీ ఇంకా తన అందాలతో కుర్ర మనసుల్ని కుదిపేస్తోన్న బిపాషా బసు కొత్త సంవత్సరాన్ని తనదైన శైలిలో స్వాగతించింది. బాలీవుడ్‌లో పేర్గాంచిన ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజా కేలండర్‌ షూట్‌లో…

నడి ముప్పయ్‌ల్లో ఉన్నా కానీ ఇంకా తన అందాలతో కుర్ర మనసుల్ని కుదిపేస్తోన్న బిపాషా బసు కొత్త సంవత్సరాన్ని తనదైన శైలిలో స్వాగతించింది. బాలీవుడ్‌లో పేర్గాంచిన ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజా కేలండర్‌ షూట్‌లో బికినీలో బిపాషా మిగిలిన హీరోయిన్లందరినీ తలదన్నేసింది. 

తనకంటే సీనియర్లని, తన కంటే జూనియర్లని కూడా బిపాషా తన అందాలతో సవాల్‌ చేసింది. టబ్బు చాటున… సోఫా చాటున నక్కి కవ్వించాలని చూసిన హీరోయిన్ల మధ్య బికినీ వేసుకుని సగర్వంగా స్టిల్లిచ్చి ఈ కేలండర్‌కే హైలైట్‌గా నిలిచింది. 

స్టార్‌ హీరోలు తనని పక్కన పడేసినా కానీ తనకున్న స్టార్‌డమ్‌తో హీరోయిన్‌ ప్రధాన చిత్రాలు చేసుకుంటూ అలరిస్తోన్న బిప్స్‌ త్వరలో ఎలోన్‌ అనే చిత్రంలో మరొక్కమారు వెండితెరకి వేడి పరీక్ష పెడుతోంది. అటు తెరలు తగలడిపోవడం… ఇటు బాక్సాఫీస్‌ మరిగిపోవడం ఖాయమని ఎలోన్‌ ట్రెయిలర్స్‌ చూస్తేనే తెలుస్తోంది.