వాళ్లు అలా అడగడం మంచిదేనంటుంది

హిందీ సినిమాల్లో బాగా అల్లరయిపోయిన అందగత్తెల్లో బిపాసాబసు మొదటి వరుసలో ఉంటుంది. ఆ సంగతిని నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం కూడా ఆమెకు ఉంది. జాన్‌ అబ్రహాంని పిచ్చి పిచ్చిగా ప్రేమించేసి సమాజాన్ని కూడా థూనా…

హిందీ సినిమాల్లో బాగా అల్లరయిపోయిన అందగత్తెల్లో బిపాసాబసు మొదటి వరుసలో ఉంటుంది. ఆ సంగతిని నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం కూడా ఆమెకు ఉంది. జాన్‌ అబ్రహాంని పిచ్చి పిచ్చిగా ప్రేమించేసి సమాజాన్ని కూడా థూనా బొడ్డు అనేసింది. 

ఇక ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకుంటున్న టైంలో లటుక్కున విడిపోయి జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసి పారేశారు. సహజీవనం ఎంత టేస్టీగా ఉంటుందో బిపాసాకు తెల్సినంతగా ఇంకెవరికీ తెలీదంటే నమ్మాల్సిందే. అలాంటి బిపాసాను చాలా మంది మొహమాటం లేకుండా అడిగేస్తుంటారు. 

ఏమని అడుగుతారంటే  ‘బిప్స్‌ ఓసారి డిన్నర్‌కు రాకూడదా’ అని. అంతే తప్ప, కానీ లంచ్‌కి మాత్రం రమ్మని అడగరట. ఎందుకంటే, డిన్నర్‌ అనగా ఈవినింగ్‌ టైమ్‌ వుంటుంది కాబట్టి. అలాగే ‘నీ కెంత కావాలో చెప్పు’ అని అడిగినవాళ్లు కూడా ఉన్నారట. అలాంటి వాళ్లకు ‘సారీ నాకు ఆ ఉద్దేశ్యం లేదు. ఇంకో అమ్మాయిని ట్రై చేసుకో’మని చెప్పేస్తుందట. అలా అడగడం మంచిదే. క్లియర్‌ అయిపోతుంది సమస్య అంటోంది బిపాసా.