ఆవిడ సెక్సీగా కనిపిస్తే హిట్టేనట

సినిమా హిట్‌ అవ్వడానికి సవాలక్ష కారణాల్లో ఒకటి హీరోయిన్‌ గ్లామర్‌గా కనిపించడం. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విస్మరించలేం. హాట్‌గా ఉన్న హీరోయిన్స్‌ అయితే ఆ విషయం ఓకే అనుకోవచ్చు. అదే ఆంటీ విషయంలోనూ,…

సినిమా హిట్‌ అవ్వడానికి సవాలక్ష కారణాల్లో ఒకటి హీరోయిన్‌ గ్లామర్‌గా కనిపించడం. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విస్మరించలేం. హాట్‌గా ఉన్న హీరోయిన్స్‌ అయితే ఆ విషయం ఓకే అనుకోవచ్చు. అదే ఆంటీ విషయంలోనూ, అందునా పద్ధతిగా కనిపించే సీనియర్‌ నటీమణుల విషయంలోనూ అది నిజమేనా? అంటే ఏమోగానీ.. ఓ ఆంటీ నటించిన సినిమాలో హాట్‌ అప్పీల్‌ ఉందనీ, అందుకే ‘దృశ్యం’ మళయాళంలో హిట్‌ అయ్యిందనీ, అక్కడ ఓ సర్వేలో తేలిందట. 

ఇంతకూ ఆ ఆంటీ ఎవరంటే మీనా. ‘మీనా.. జలతారు వీణా’ అని పాటలానే, మీనా నిజంగానే చేపల్లాంటి కళ్లతో బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది. అలాంటి మీనాని ఆ సినిమాలో కెమెరామెన్‌ చాలా బాగా చూపించాడు. సినిమాలో మీనా నైటీలు కూడా వేసుకుని భర్తతో ఆడే సరసం గొప్పగా పండిందంటున్నారు సర్వేలో. 

మీనాని చూసి తరించడానికే ఆ సినిమా రిపీట్‌గా చూసినవాళ్లు కూడా ఉన్నారట. కాబట్టి ‘దృశ్యం’ సినిమా హిట్‌ అవ్వడానికి మీనా గ్లామర్‌ ఎంతగానో ఉపయోగపడిందని మనం కూడా ఒప్పుకోక తప్పదు.