బ్లాక్ అండ్ వైట్ కాలంలో అందాల విందు చేసిన మర్లిన్ మన్రోని, బోడెరెక్‌నీ శృంగార ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. అలాగే భారీ అందాల నటి నమితను కూడా ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోరని ఆవిడే స్వయంగా చెబుతుంది. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమాలో సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న నమిత ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
అసలే అందాలరాశి. ఆపై భారీ గ్లామర్. ఆఫీసర్‌గా టైట్ చొక్కా టైట్ ప్యాంట్‌లో ఆమె గ్లామర్‌ని వర్ణించడం కష్టమే. అందానికి ఒక కొలబద్ద అంటూ లేదని చెబుతోన్న నమిత, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లియోనార్డో వేసిన పెయింటింగ్‌లో మోనాలిసా తన కన్నా ఇంకా లావుగా, దిట్టంగా ఉంటుందనీ ఆ రోజుల్లో అలాంటి అందాలనే ఎంజాయ్ చేసారని కూడా అంటోందామె.
తెలుగు సినిమాల్లోనే కాదు తనకు దక్షిణాది అంతా అభిమానులు ఉన్నారనీ, తానెక్కడికెళ్లినా క్షణాల్లో అభిమానులు ఈగల్లా వాలిపోతారనీ.. నమిత చెబుతోందట. అయితే నమితను పెళ్లి గురించి అడిగితే మాత్రం టాపిక్ డైవర్ట్ చేసేస్తోంది. ‘పెళ్లి చేసుకుంటాను.. అయితే నా సీనియర్స్‌కు ముందు పెళ్లి జరగాలి కదా.. వాళ్ల కంటే ముందు నా పెళ్లి అంటే బాగోదు కదా..’ అంటోంది నమిత. పెళ్లి చేసుకోవడానికి ఆర్డర్ ఏంటీ.. ఎవరి ఆలోచనలు, వయసుని బట్టి వాళ్లు పెళ్లాడతారని నమితకు తెలీదంటారా?