దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటోన్న సిద్ధార్థ్, సమంత త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు చాలా సార్లు వినిపించాయి. వారిద్దరి మధ్య ఏదో ఉందనేది ఎప్పుడో లీక్ అయినా కానీ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు సిద్ధార్థ్ ఇష్టపడలేదు. సమంత కూడా పబ్లిగ్గా తనకి సిద్‌పై ఉన్న ప్రేమ గురించి డిస్‌క్లోజ్ చేయలేదు.
ఇప్పటికీ కలిసే ఉన్నారని అనుకుంటోన్న ఈ ప్రేమజంట విడిపోయిందని, ఈమధ్యే కటీఫ్ చెప్పేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తమ రిలేషన్ గురించి ఎప్పుడూ బయటకి మాట్లాడని వీరిద్దరూ ఇప్పుడు బ్రేక్‌లప్ గురించి మాట్లాడతారని అనుకోలేం. అయితే ఈ బ్రేకప్ వ్యవహారం సమంతని చాలా బాధించిందని వినిపిస్తోంది.
సిద్ధార్థ్‌కి బ్రేకప్స్ కొత్త కాదు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సిద్ ఆ తర్వాత సోహా అలీ ఖాన్‌తో చాలా కాలం అఫైర్ నడిపాడు. శృతిహాసన్‌తోను లింకప్ ఉందని అనుకున్నారు. సమంతతో చాలా కాలం సాగిన ప్రేమ వ్యవహారం ఎందుకు ముగిసిందనేది మాత్రం తెలీలేదు.