ఒక అనువాద చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ నలభై కోట్ల వరకు జరుగుతోందంటే ఆషామాషీ విషయం కాదు. కేవలం శంకర్ బ్రాండ్‌పై ఇంత బిజినెస్ చేసి ‘ఐ’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం అనువాద హక్కులని ఎన్.వి. ప్రసాద్ ముప్పయ్ ఆరు కోట్లకి తీసుకుంటే పెద్ద రిస్క్ అని అనుకున్నారు.
కానీ కేవలం థియేట్రికల్ బిజినెస్‌తోనే నలభై కోట్లు చేసిందని, ఆల్రెడీ నిర్మాత లాభాల్లోకి చేరుకున్నారని, ఇంకా శాటిలైట్ రైట్స్‌లో కూడా యాభై శాతం వాటా వస్తుందని, అది కాక సినిమాకి లాభాలొస్తే అందులోను వాటా ఉందని ట్రేడ్ రిపోర్ట్. ఎలా చూసినా కానీ ఈ చిత్రంతో నిర్మాత హాండ్సమ్ ప్రాఫిట్ చేసుకున్నట్టే.
శంకర్ నాలుగేళ్ల క్రితం తీసిన రోబో తెలుగులో 38 కోట్ల షేర్ రాబట్టింది. ఐతో మళ్లీ శంకర్ సిమిలర్ రేంజ్ సాధించాలి. రజనీకాంత్ లేకుండా శంకర్ అంత రాబడతాడో లేదో తేలాలి. గోపాల గోపాలతో పోటీ కూడా ఉండనే ఉంది.