గుర్తింపు లేని మెగా హీరో

చిరంజీవి ఫ్యామిలీ నుంచి వస్తోన్న హీరోలంతా కూడా ఇంప్రెస్‌ చేస్తున్నారు. పవన్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ ఆల్రెడీ పెద్ద స్టార్స్‌ అయిపోతే… రీసెంట్‌గా పరిచయమైన సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా మొదటి సినిమాతోనే…

చిరంజీవి ఫ్యామిలీ నుంచి వస్తోన్న హీరోలంతా కూడా ఇంప్రెస్‌ చేస్తున్నారు. పవన్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ ఆల్రెడీ పెద్ద స్టార్స్‌ అయిపోతే… రీసెంట్‌గా పరిచయమైన సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా మొదటి సినిమాతోనే ఫ్యూచర్‌ ఉందనిపించుకున్నారు. ఎటొచ్చీ గుర్తింపు తెచ్చుకోలేకపోయిందీ.. మెగా ఫాన్స్‌ ఆదరణ చూరగొనలేకపోయింది అల్లు శిరీష్‌ ఒక్కడే. 

మారుతి తీసిన ‘కొత్త జంట’తో తన అకౌంట్‌లోను ఒక సక్సెస్‌ పడిరది కానీ ఇంకా అతనికి తగిన గుర్తింపు మాత్రం దక్కలేదు. కొత్త జంట తర్వాత శిరీష్‌ ఎక్కడా కనిపించడం లేదు. మెగా ఫంక్షన్లకి కూడా గైర్హాజరు అవుతున్నాడు. కనిపించకపోవడానికి కారణం ఏమిటో కానీ.. పెద్ద టార్గెట్‌తోనే తిరిగి వెండితెర మీదకి రాబోతున్నాడు. 

యువత, సోలోలాంటి చిత్రాలతో మెప్పించిన యువ దర్శకుడు పరశురామ్‌ డైరెక్షన్‌లో అల్లు శిరీష్‌ నెక్స్‌ట్‌ మూవీ ఉంటుందట. చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన పరశురామ్‌.. ఫైనల్‌గా శిరీష్‌తో చేసేయాలని డిసైడ్‌ అయ్యాడట. దీనిని అల్లు అరవింద్‌ నిర్మిస్తారని తెలిసింది. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు కానీ శిరీష్‌కి మంచి ప్రాజెక్టే సెట్‌ అయింది.