ఫిబ్రవరి 14 సూర్య వెర్సస్ సూర్య?

నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న సినిమా సూర్య వెర్సస్ సూర్య. ఈ సినిమా దాదాపు పూర్తయిపోయింది. ఒక్క రోజు షూటింగ్ బకాయి వుంది. ఈ సినిమా టీజర్ నేడు విడుదలవుతోంది. సినిమాను…

నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న సినిమా సూర్య వెర్సస్ సూర్య. ఈ సినిమా దాదాపు పూర్తయిపోయింది. ఒక్క రోజు షూటింగ్ బకాయి వుంది. ఈ సినిమా టీజర్ నేడు విడుదలవుతోంది. సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 

ఎండలోకి వెళ్తే సమస్య వచ్చే కుర్రాడి ప్రేమకథ ఈసినిమా. కార్తికేయ సినిమా అందించిన చందు దీనికి మాటల రచయిత. ఇదిలా వుంటే అదే ఫిబ్రవరిలో బహుశా నిఖిల్ నటించే రెండు సినిమాలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి.​