‘కంచె’ వెనక్కి?

దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ తో రూపొందించిన చిత్రం కంచె. దేశభక్తి, జవాన్లు కథాంశంతో రూపొందించిన ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేద్దాం అనుకున్నారు. దసరా సీజన్…

దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ తో రూపొందించిన చిత్రం కంచె. దేశభక్తి, జవాన్లు కథాంశంతో రూపొందించిన ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేద్దాం అనుకున్నారు. దసరా సీజన్ కూడా కలిసి వస్తుందని. అయితే ఇప్పుడు దసరా సీజన్ ఫుల్ ప్యాక్డ్ గా మారేలా కనిపిస్తోంది. 

పైగా మెగా స్టార్ వారసుల సినిమాలు సాయి ధరమ్ తేజ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', రామ్ చరణ్ తేజ-శ్రీనువైట్ల సినిమాలు కూడా కాస్త అంటు ఇటుగా దసరా సీజన్ కే వస్తున్నాయి. ఇవి కాక మిగిలిన హీరోల సినిమాలు కూడా వుండనే వున్నాయి. దసరా సీజన్ అంటే మాస్ సినిమాలకే ఎక్కవ అవకాశం వుంటుంది. 

క్రిష్ సినిమా అంటే కాస్త క్లాసే తప్ప, మాస్ కాదు. అందుకే ఈ సీజన్ లో వీటితో పోటీ పడే బదులు, సేఫ్ జోన్ కు వెళ్తే ఎలా వుంటుదని ఆలోచిస్తున్నారని వినికిడి. ఒకటి రెండు రోజుల్లో ఏం సంగతీ నిర్ణయిస్తారట.