సర్దార్ గా మారిన గబ్బర్ సింగ్ 2 సినిమా హీరోయిన్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చిందా అన్నది అనుమానం..ఆల్ ఆఫ్ ది సడెన్ గా అనీషా అంబ్రోస్ ను కధానాయికగా ఎంపిక చేసి, అందరినీ ఖంగు తినిపించారు. ఆపై ఆమెకు ట్రయినింగ్ అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. తీరా చేసి, ఇప్పుడు ఆమె నటన సరిగ్గా సినిమాకు సూట్ కావడం లేదని పవన్ అనుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి.
మరికొద్ది రోజుల్లో సర్దార్ షూటింగ్ పక్కాగా ప్రారంభం కాబోతోంది. మరి ఇప్పుడు హీరోయిన్ అనీషాయేనా? లేక మారిందా అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. బహుశా షూటింగ్ ప్రారంభమైతే ఓ క్లారిటీ వస్తుందేమో? ఇదిలా వుంటే పవన్ సర్దార్ పూర్తి చేయడంపై చాలా వ్యవహారాలు ఆధారపడి వున్నాయి.
ఎందుకంటే ఆ వెంటనే రెండు సినిమాలు చేయాల్సి వుంది. మైత్రీ మూవీస్ దగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు. దర్శకుడు దాసరికి ఓ సినిమా చేస్తా అని మాటిచ్చారు. రామ్ చరణ్ తో సినిమా నిర్మాణం అన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే, 2017 దాటిపోతుందేమో?