ఈ తరం హీరోయిన్లలో కాస్త సీనియార్టీ వున్న వాళ్ల జాబితాలో త్రిష కృష్ణన్ కూడా కచ్చితంగా వుంటుంది. వయసు మీద పడుతున్నా కెరీర్ కు మాత్రం ఢోకా లేదు. పైగా ఇటీవల పెళ్లి కుదిరి, మళ్లీ ఆగిపోయాక, ఇంకా జోష్ మీద వుంది. అయితే ఇప్పుడు త్రిష రాజకీయాల్లోకి అడుగుపెడుతుందా అన్న వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇటీవల త్రిష వున్నట్లుంది ఓ సాధారణ యువతి మాదిరిగా లోకల్ మెట్రో రైల్లో ప్రయాణించి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎమ్ కెలో త్రిష చేరుతుందని, బహుశా ఏదైనా నియోజకం వర్గం నుంచి పోటీకి దిగినా ఆశ్చర్యం లేదని వార్తల సారాశం.
రాజకీయ బంధాలు లేని తమిళ నటులు చాలా తక్కువ మంది వుంటారు. పోటీ చేసినా, చేయకున్నా, పార్టీలతో, నాయకులతో బంధాలు మాత్రం వుంటాయి. అందువల్ల త్రిష రాజకీయ పార్టీ చేరిక ఆశ్చర్యమైతే కాదు.