షాకింగ్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు!

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు…

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది.

వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు 2018లో కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే కాదని కోర్టు తీర్పునిచ్చింది. కాగా 2018లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.  

2014 ఎన్నిక‌ల నామినేష‌న్‌తో వ‌న‌మా దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌కు.. 2018లో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌కు చాలా తేడా ఉంద‌నే జ‌ల‌గం ప్ర‌ధాన ఆరోప‌ణ‌. కుటుంబ స‌భ్యుల ఆస్తుల‌ను స‌రిగా వెల్ల‌డించ‌లేద‌ని ఓడిపోయిన వెంట‌నే ఆయ‌న కోర్టుమెట్లెక్కారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.