సాధారణంగా తెలుగు సినిమాల్లో సాంగ్ అనగానే ఒక మేల్ సింగర్, ఓ ఫిమేల్ సింగర్ కలిసి ఆలపిస్తారు. లేదంటే సోలో సాంగ్ ఉంటుంది. కొన్ని పాటలకు నలుగురు లేదా ఐదుగురితో కోరస్ పాడిస్తుంటారు. కానీ ఒకే పాటకు 30 మంది సింగర్స్ వర్క్ చేసిన సందర్భం ఇది.
పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. ఈరోజు ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ రిలీజైంది. ఈ పాటను 30 మందికి పైగా గాయనీగాయకులు ఆలపించడం విశేషం.
ఈ థీమ్ ఆల్రెడీ పెద్ద హిట్టయింది. టైటిల్ ఎనౌన్స్ మెంట్, గ్లింప్స్ లో ఈ థీమ్ ను వాడారు. యూత్ లో బాగా చొచ్చుకుపోయిన ఈ బిట్ సాంగ్ కు ఎక్స్ టెండెడ్ వెర్షన్ ఇచ్చాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఆల్రెడీ హిట్టయిన బిట్ సాంగ్ ను మరింత సక్సెస్ ఫుల్ గా కంపోజ్ చేయడం పెద్ద టాస్క్.
ఈ బిట్ సాంగ్ ను, పెద్ద సాంగ్ గా మార్చిన తమన్.. 30 మందికి పైగా సింగర్స్ తో ఈ పాటను పాడించాడు. బిట్ సాంగ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఈ ఎక్స్ టెండెడ్ వెర్షన్. అయితే సినిమాలో ఇది పూర్తిస్థాయిలో ఉంటుందా ఉండదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
సన్నివేశం డిమాండ్ చేస్తే, మ్యూజిక్ కోసం ఎంతైనా చేయాల్సి ఉంటుందని ఈమధ్య గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు తమన్. అల వైకుంఠపురములో, అఖండ సినిమాల కోసం భారీ ఆర్కెస్ట్రాను వాడాడు. విదేశాల నుంచి సంగీత/వాయిద్య కళాకారుల్ని రప్పించాడు. ఇప్పుడు బ్రో కోసం ఏకంగా 30 మంది సింగర్స్ తో థీమ్ సాంగ్ పాడించాడు.
ఇది కమర్షియల్ కథ కాదు. అయినప్పటికీ ఈ సినిమాకు తమదైన స్టయిల్ లో మ్యూజిక్ ఇచ్చి కమర్షియల్ టచ్ ఇచ్చాడు తమన్.