డిప్రెషన్ లో అఖిల్?

నీ అంతవాడు లేడు..నీ సినిమా లాంటి సినిమా ఇక రాదు..అన్న రేంజ్ లో మోసేసారు అఖిల్ ను…అతగాడి అఖిల్ సినిమాను మన సినిమా జనాలు. సినిమా రంగంలో పుట్టి పెరిగినా కూడా సినిమా జనాల…

నీ అంతవాడు లేడు..నీ సినిమా లాంటి సినిమా ఇక రాదు..అన్న రేంజ్ లో మోసేసారు అఖిల్ ను…అతగాడి అఖిల్ సినిమాను మన సినిమా జనాలు. సినిమా రంగంలో పుట్టి పెరిగినా కూడా సినిమా జనాల మోత వ్యవహారాల ధర్మసూక్ష్మం వంటపట్టలేదు అఖిల్ కు. దాంతో అవన్నీనిజం అనుకున్నాడు. తీరా చేసి, సినిమా బక్సాఫీసు దగ్గర ఫట్ మని, నిర్మాణ వ్యయంలో సగం డబ్బులు కూడా తెచ్చుకోకపోవడంతో, కుర్రాడు పూర్తిగా డీలా పడిపోయాడని తెలుస్తోంది. 

సినిమా విడుదల అనంతరం దాన్ని ఎత్తే ప్రయత్నం కూడా చేయకుండా గోవా వెళ్లిపోయాడు.రెస్ట్ కావాలంటూ. అక్కడ వారం గడిపి వచ్చాడు. అయినా కూడా మనిషి తేరుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు మూడు రోజులుగా తన ఇంటికే పరిమితమైపోయాడట. ఎవ్వరితోనూ అంతగా ఇంట్రాక్ట్ కావడం లేదని తెలుస్తోంది.ఎవరైనా పలకరించినా, నౌ ఐ వాంట్ రెస్ట్..తరువాత మాట్లాడదాం అంటున్నాడని టాలీవుఢ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా మరీ ఇంత సెన్సిటివ్ అయితే టాలీవుడ్ లో కష్టం. 

ఇక్కడ తోలు కాస్త మందం కావాలి.సినిమా డిజాస్టర్ అయినా జనం ముందుకు, నవ్వుతూ వచ్చి, మంచి కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి..జనం నుంచి రెస్పాన్స్ అదిరిపోతోంది..అంటూ సక్సెస్ మీట్ లు పెట్టగలిగి వుండాలి. అఖిల్ డ్యాన్స్ లు, ఫైట్లు, నటన, నేర్చుకున్నాడు..కానీ ఈ వ్వవహరాలు ముందు నేర్చుకోవాలి..టాలీవుడ్ లో హీరోగా వుండాలంటే. కావాలంటే వినాయక్ ను చూడండి..ఆయనేమన్నా ఫీల్ అవుతున్నారా..ఇలాంటి సినిమా తీసినందుకు.