టాలీవుడ్ జనాలు ఆర్జీవీ తీరును దాదాపు అసహ్యించుకుంటున్నారు. పైకి ఏమీ అనలేక ఊరుకుంటున్నారు. ఏమిటి రోజూ రాత్రి పూట ఈ ట్వీట్ల న్యూసెన్స్ అంటున్నారు. బ్రూస్ లీ అంటూ కంపు చేసి, రామ్ చరణ్ ను నానాయాగీ చేసాడు. చిరంజీవి 150 సినిమా అంటూ నానా హంగామా చేసాడు. అఖిల్ సినిమా పట్టుకుని అదే పోకడ..ఇప్పుడు కుర్రాడు ఏదో నాలుగు సినిమాలు చేసుకుంటాడు అంటే రాజ్ తరుణ్ పై మిగిలిన స్టార్లను రెచ్చగొడుతున్నాడు.
రాజ్ తరుణ్ సూపర్ ఈ వారసులు వేస్ట్ అంటూ. దీంతో వాళ్లకు ఇతగాడిపై మండుకురావాలన్నది ప్లాన్,. ఎందుకంటే రాజ్ తరుణ్ ఆర్జీవీతో సినిమా చేయను అని స్ఫష్టంగా అతగాడికే చెప్పేసాడు..అలాగే ఓ పూరి ప్రపోజల్ కూడా పెద్దగా ముందుకు కదలలేదు. బహుశా అదే ఆర్జీవీకి కోపం కావచ్చు. అందుకనే పొగుడుతున్నట్లు పొగపెడుతున్నాడు. ‘ ఏం అంటాం..మామూలు జనం అయితే రోడ్డున పడి కొట్టుకుంటాం..కానీ కాస్త పేరు, పరువు వున్నవాళ్లు ఇలా చేయలేరు కదా’ అన్నాడో సినిమా మనిషి.
ఎదుటివాడి వ్యవహారాలు మనకు అనవసరం మన పని మనం చూసకోవాలి అన్న జ్ఞానం ఆయనకు వుండాలి అన్నాడు ఇంకో వ్యక్తి. ఆయన సినిమాలు దాదాపు మూడు పూర్తి, విడుదలకు నోచుకోకుండా అలా పడి వున్నాయి. వాటి సంగతి చూసుకోవచ్చు కదా అన్న కామెంట్ కూడా వినిపిస్తున్నాయి. ఇలా హీరోలకు హీరోలకు పోలిక పెడుతూ ట్వీట్ లు చేయడం వల్ల పరిశ్రమలొ మంచి వాతావరణం దెబ్బతింటుందంటున్నారు.