హరీష్ శంకర్..ఫ్లాప్ ల ట్రాక్ రికార్డును గబ్బర్ సింగ్ తో బ్రేక్ చేసాడు. కానీ మళ్లీ రామయ్యా వస్తావయ్యాతో ఫ్లాప్ ల పరంపర కొనసాగిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే పరమ రొటీన్ సినిమా తీసి, హిట్ హిట్ అంటూ నానా హంగామా చేసినా, అసలు లెక్కలు తెలిసిన ఇండస్ట్రీ ఇంత వరకు హరీష్ కు మరో చాన్సివ్వలేదు. బన్నీకి ఓ లైన్ చెప్పి, ఓకె అనిపించుకున్నాడు కానీ, సినిమా పట్టాలు ఎక్కుతుందా ఎక్కదా అన్నదాంట్లో ఇప్పటి దాకా క్లారిటీ లేదు. అందుకే ఓ పక్క బన్నీని దువ్వుతూనే, మరోపక్క తన పాత నేస్తం రవితేజ ను కూడా చాన్స్ కోసం అడుగుతున్నాడని వినికిడి.
రవితేజ చేతిలో ప్రస్తుతానికైతే కమిట్ మెంట్ లు ఏమీ లేవు. సుధీర్ వర్మ కథ చెప్పాడంతే. బెంగాల్ టైగర్ రిజల్ట్ తరువాతే ఏదయినా? పోనీ బన్నీ, రవితేజ ఏదీ తేల్చకుండా వున్నరు..సాయిధరమ్ తేజతోనే మరో సినిమా చేద్దామా అంటే అతగాడు ప్రస్తుతానికి రెండు సినిమాలతో హడావుడిగా వున్నాడు. పోనీ పవన్ ఏమన్నా దయతలుస్తాడా అన్న ఆశ గతంలో వుండేది కానీ, ఇప్పుడదీ లేదు.
దాంతో ఇంకే హీరోకి కథ చెప్పాలా అని హరీష్ కిందా మీదా పడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.