మంచి దర్శకుడు, అవసరంలో వున్నాడు..అని ఆదుకుని, అవకాశం ఇచ్చాడు మహేష్ బాబు. అలా పివిపి నిర్మాతగా బ్రహ్మోత్సవం ప్రాజెక్టు స్టార్ట్ అయింది. అప్పట్లో లైన్ మాత్రమే విన్నాడు..డెవలప్ చేయగలడని ముందుకు సాగాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందని వినికిడి. శ్రీకాంత్ అడ్డాల తయారు చేసిన స్క్రిప్ట్ మహేష్ కు అంతగా నచ్చలేదన్న టాక్ వినిపిస్తోంది. పదే పదే మార్పులు చెబుతున్నాడని, కానీ వాటిని శ్రీకాంత్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో ఒక దశలో కొన్నాళ్లు ప్రాజెక్టు ఆపాలా అన్న డిస్కషన్ కూడా జరిగిందంటున్నారు. ఇప్పుడు మహేష్ మెప్పించే స్క్రిప్ట్ తయారీకి శ్రీకాంత్ కిందామీదా అవుతున్నాడట. ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కాబట్టి ఆపడం అంటూ వుండదు. ఎటొచ్చీ, కాస్త సలహాలు, సంప్రదింపులు, చర్చలు సాగించి ముందుకు వెళ్తారు. శ్రీమంతుడు రిజల్ట్ తరువాత మహేష్ బాబు స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆగడు విషయంలో శ్రీను వైట్లను వదిలేసినట్లు వదిలేయడం లేదు.