ఓ అగ్ర నటుడికి, ఆయన బంధువైన మరో నటుడికి మధ్య ఓ కారు తకరారు తెచ్చి పెట్టిందా? టాలీవుడ్ లో ఈ మేరకు గ్యాసిప్ గుప్పుమంటోంది. ఈ నటుడు ఓ కారు కొన్నాడు..అది ఉమ్మడిగా వాడుకుంటున్నారు..ఇప్పుడు ఆ కారు వెనక్కు ఇవ్వమని కోరినట్లు, దానికి ఆ బంధువు అంత సుముఖత చూపించనట్లు తెలుస్తోంది.
దీంతో ఇద్దరి మధ్య కాస్త సంబంధాలు దెబ్బతిన్నాయని వినికిడి. నిజానికి ఆ నటుడి స్టేటస్ తో, స్థోమతతో పోల్చుకుంటే, ఆ కారు నథింగ్. కానీ మరి ఎందకు అడిగినట్లో? పోనీ అడిగాడు కదా అని ఆ బంధువు ఇచ్చేస్తే పోయేది కదా..ఎందుకంటే దానిపై అతగాడికి ఏమీ రైట్ లేదు కూడా.
అయితే ఈ తకరారు నేరుగా కాకుండా ఉద్యోగులు వెళ్లి అడగడం, ఇవ్వనని చెప్పడం జరిగింది కానీ, నేరుగా ఒకరిని ఒకరు అడగలేదని ఒక టాక్. లేదు కాస్త గట్టి గడబిడే జరిగిందని మరో టాక్. ఏమిటో ఈ డబ్బు వున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న తగాయిదాలు?