రఘువరన్ చేజారింది

డౌన్ టు ఎర్త్ పాత్రలు చేయాలంటే మన హీరోలకు ఎందుకో అంతగా కిట్టదు. ఎక్కడో మంచి సినిమా వస్తే, బాగుంది అనుకుంటే అప్పుడు ట్రయ్ చేయడానికి చూస్తారు. అప్పుడు కూడా వీలయినంత డీగ్లామర్ కాకుండా…

డౌన్ టు ఎర్త్ పాత్రలు చేయాలంటే మన హీరోలకు ఎందుకో అంతగా కిట్టదు. ఎక్కడో మంచి సినిమా వస్తే, బాగుంది అనుకుంటే అప్పుడు ట్రయ్ చేయడానికి చూస్తారు. అప్పుడు కూడా వీలయినంత డీగ్లామర్ కాకుండా చూసుకుంటారు. 

రఘువరన్ బిటెక్ సినిమా వ్యవహారం అలాంటిదే. అదే కథ మనవాళ్ల దగ్గరకు తెస్తే, దూరంగా వుంటారు. కానీ తమిళంలో హిట్ అయ్యేసరికి ఒకరిద్దరు హీరోలు అటు దృష్టి పెట్టారు. ఆఖరికి స్రవంతి రవికిషోర్ తమ ఇంటి హీరో రామ్ కోసం కొన్నారు. 

కానీ మరి రామ్ చేయడానికి ముందు వెనుక ఆడారో లేక, ధనుష్ డబ్బింగ్ కే ఓకె అన్నాడో మొత్తానికి రీమేక వదిలేసారు. డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసారు. ఇప్పుడు దానికి వస్తున్న ఆదరణ చూసి అరెరే,.,.అనుకోవడం రామ్ వంతయింది. రామ్ మాత్రమే కాదు మంచు మనోజ్ కూడా దాని కోసం విఫలయత్నం చేసినట్లు వినికిడి.