ఆగస్టు 5 నుంచి గబ్బర్ సింగ్ 2

మొత్తానికి గబ్బర్ సింగ్ 2 మలి షెడ్యూలు ఫిక్సయింది. కొద్దిరోజులు మహరాష్ట్రంలో షూటింగ్ జరపుకుని, వెనక్కు వచ్చింది టీమ్. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఆఖరికి ఇప్పుడు…

మొత్తానికి గబ్బర్ సింగ్ 2 మలి షెడ్యూలు ఫిక్సయింది. కొద్దిరోజులు మహరాష్ట్రంలో షూటింగ్ జరపుకుని, వెనక్కు వచ్చింది టీమ్. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఆఖరికి ఇప్పుడు మలి షెడ్యూలు ఫైనల్ అయింది. 

ఆగస్టు 5 అయిదు నుంచి రెండో షెడ్యూలు ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూలు హైదరాబాద్ లోనేవుంటుంది. మోస్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీ లేదా అన్నపూర్ణలో వుండొచ్చు. ఈ షెడ్యూలులో పవన్ కళ్యాణ్ పూర్తిగా పాల్గొంటారు. ఈ షెడ్యూలు ఎన్ని రోజులు వుంటుందన్నది ఇంకా తెలియదు. 

పవన్ తో పాటు పలువురు సపోర్టింగ్ నటులు, కమెడియన్ లు కూడా ఈ షెడ్యూలు లో పాల్గొంటారు. దర్శకుడు రవీంద్ర (బాబి) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.