దిల్ రాజు సినిమాకు కొరటాల శివ

ఎన్టీఆర్ తో జనవరి నుంచి ఓ సినిమా ప్రారంభిస్తున్నట్లు దిల్ రాజు తిరుపతిలో వెల్లడించాడు. అయితే డైరక్టర్ ఎవరు అన్నది చెప్పలేదు. అది కొరటాల శివే అని తెలుస్తోంది. సుకుమార్ సినిమా తరువాత కొరటాల…

ఎన్టీఆర్ తో జనవరి నుంచి ఓ సినిమా ప్రారంభిస్తున్నట్లు దిల్ రాజు తిరుపతిలో వెల్లడించాడు. అయితే డైరక్టర్ ఎవరు అన్నది చెప్పలేదు. అది కొరటాల శివే అని తెలుస్తోంది. సుకుమార్ సినిమా తరువాత కొరటాల శివ సినిమా వుంటుందని గతంలోనే వినిపించింది. 

అయితే తరువాత అది మరుగునపడింది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించింది. అయతే త్రివిక్రమ్ సినిమా సంగతి ఎలా వున్నా, దిల్ రాజు-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాకు కొరటాల శివను డైరక్టర్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ముందుగా కొరటాల శివ లైన్ చెప్పాడని, అది ఓకె చేసారని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమా తరువాత ఈ సినిమా పూర్తి వివరాలు మీడియా ముందుకు వస్తాయి.