శ్రీమంతుడికీ అదే స్ట్రాటజీ

ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నారు ఎగ్జిబిటర్లు సినిమా టికెట్ రేట్ల పెంచమని. కానీ కామన్ మాన్ గోలపెడుతారని, ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. కానీ కామన్ మాన్ సంగతి ఎలా వున్నా తొలివారమే సినిమా చూసేయాలని…

ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నారు ఎగ్జిబిటర్లు సినిమా టికెట్ రేట్ల పెంచమని. కానీ కామన్ మాన్ గోలపెడుతారని, ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. కానీ కామన్ మాన్ సంగతి ఎలా వున్నా తొలివారమే సినిమా చూసేయాలని పిచ్చెక్కిపోయే అభిమానులు ఎంతయినా ఇచ్చేస్తారని నిర్మాతలకు తెలుసు. 

పైగా టికెట్ రేట్లు పెరిగితే ఎగ్జిబిటర్లకు తద్వారా తమకు ఎక్కువ మొత్తం వస్తుందనీ తెలుసు. పైగా రికార్డులు బద్దలు కొట్టింది తమ సినిమా అని అభిమానులు తృప్తిపడొచ్చు. పైగా భారీ రేట్లకు సినిమాను అమ్మితే వచ్చే లాభాలే వేరు. 

ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయింది బాహబలికి. అధికారపార్టీలతో వున్న సంబంధాలు ఇందకు సాయం చేసాయి. ఇప్పుడు శ్రీమంతుడు సినిమాకు కూడా ఇదే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగూ మహేష్ బావ, గల్లా జయదేవ్ కు సన్నిహితమే. 

అలాగే తెలంగాణలో హీరో కృష్ణ కూడా కేసిఆర్ కు సన్నిహితమే. అందువల్ల టికెట్ రేట్లు అనఫిషయల్ గా పెంచుకోవడానిక అడ్డంకి ఏమీ వుండదు. ప్రభుత్వమే మద్దతుగా వుంది అంటే కింద స్థాయి అధికారులకు ఏమొచ్చె. 

ఇప్పటికే శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఈ మేరకు వ్యవహారాలు సెట్ అయిపోయినట్లు తెలుస్తోంది. సో తొలివారం రికార్డులు క్రియేట్ చేయడానికి శ్రీమంతుడు రెడీ అయిపోతున్నాడు.