ఆ జోడీ మళ్లీ మరోసారి

టైగర్ సినిమాతో జోడీ కట్టారు హీరో సందీప్ కిషన్…దర్శ‌కుడు విఐ ఆనంద్. వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ప్రిపేర్ చేసే విఐ ఆనంద్ ఈ సారి ఓ థ్రిల్లింగ్ కథతో మళ్లీ సందీప్ కిషన్ తో…

టైగర్ సినిమాతో జోడీ కట్టారు హీరో సందీప్ కిషన్…దర్శ‌కుడు విఐ ఆనంద్. వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ప్రిపేర్ చేసే విఐ ఆనంద్ ఈ సారి ఓ థ్రిల్లింగ్ కథతో మళ్లీ సందీప్ కిషన్ తో సినిమా చేస్తున్నారు. 

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ కలిసి నిర్మించే ఈ సినిమా టైటిల్..ఊరి పేరు భైరవ కోన. టైటిల్ తోనే తెలిసిపోతోంది ఏదో సమ్ థింగ్..సమ్ థింగ్ అని.

హీరో సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా భైరవకోన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేసారు. పోస్టర్ లో ఒక సరికొత్త లోకం అన్నట్లుగా బ్యాక్ డ్రాప్, అలాగే చేతిలో చిత్రమైన కర్రతో హీరో కనిపిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ మెటీరియల్ చూస్తుంటే విఐ ఆనంద్ ఓ ఇంట్రస్టింగ్ స్టోరి ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

కావ్య ధాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చొటా కే ప్రసాద్ ఎడిటర్. శేఖర్ చంద్ర సంగీతం..రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం విశేషం.