ఆ హీరో చేసిన సినిమాలు లెక్క పెట్టడానికి ఓ చేతి వేళ్లు కూడా అక్కరలేదు. అయితే అతని వ్యవహారంపై మాత్రం ఇండస్ట్రీలో బాగానే డిస్కషన్ లో వుంటోంది. టాలీవుడ్ లో ఏదయినా ఓకె కానీ ఏటిట్యూడ్ సరిగ్గా లేకుంటే మాత్రం కాస్త కష్టం. నాగ్ అయినా, చరణ్ అయినా, ఎవరైనా ఈ రోజుకూ పర్సనల్ గా ఎలా వున్నా, ఇండస్ట్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా వుంటారందుకే. ఈ కుర్ర హీరోకు హ్యాండ్ ఫుల్ అసైన్ మెంట్లు వున్నాయి.
దాని వల్లనో, మరి అతని వ్యవహారం అలాంటిదో..ఫోన్లు ఎత్తకపోవడం సంగతి అలా వుంచి, అతగాడికి ఏ మాత్రం నచ్చకపోయినా బ్లాక్ లిస్ట్ లో చేర్చేస్తాడట. తనతో సినిమా చేస్తున్నపుడే నిర్మాత పదే పదే ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్ లో చేర్చేసాడని వినికిడి. ఎవరైనా తమ నెంబర్ బ్లాక్ లిస్టులో చేరిందని, వేరే నెంబర్ తో ఫోన్ చేసి, అదేమని అడిగితే, నీతో మాట్లాడడం నాకు నచ్చలేదనో, నచ్చనపుడు డిస్కషన్ ఎందుకనో.. మొహమాటం లేకుండా చెప్పేస్తాడట.
దాంతో ఇండస్ట్రీలో జనాలు కుర్ర హీరోపై కాస్త గుర్రుగానే వున్నారు. కుర్రాడికి ఇంకా ఇండస్ట్రీ సంగతి తెలియదని..ఇక్కడ మహా మహులే మాయం అయిపోయారని కామెంట్ లు చేస్తున్నారు. నలుగురితో మంచిగా నటిస్తూ అయినా ముందుకు పోవాలి తప్ప, ఏటిట్యూడ్ వుంటే అంత మంచిది కాదని ఉచిత సలహాలు కూడా వినిపిస్తున్నాయి.