టాలీవుడ్ లో చిత్రమైన పరిస్థితి వుంది. సినిమాలు చేద్దామంటే హీరోలకు డైరక్టర్లు దొరకడం లేదు. అదే సమయంలో డైరక్టర్లకు హీరొలు దొరకడం లేదు. అఖిల్ కు డైరక్టర్ కావాలి..చెర్రీకి కూడా..అంతే కాదు, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయితే ఎన్టీఆర్, బన్నీ, మహేష్, నితిన్ ఇలా చాలా మందికి డైరక్టర్లు కావాలి. కానీ అదే సమయంలో భయంకరమైన ఫ్లాపులో, లేదో హిట్ అని డప్పు కొట్టుకున్నవో, లేదా ఏవరేజ్ బోర్టర్ దగ్గరకు వచ్చి ఆగినవో అందించిన డైరక్టర్లకు ఇప్పుడు హీరోలు కావాలి.
హరీష్ శంకర్.. శ్రీనువైట్ల.. గోపీచంద్ మలినేని.. వివి వినాయక్.. కొండా విజయ్ కుమార్, సుధీర్ వర్మ.. గుణశేఖర్.. నీలకంఠ.. ఇలా జాబితా చాలా పెద్దదే వుంది. ఇప్పుడు వీరంతా సినిమాల కోసం కిందా మీదా అవుతున్నారు. ప్రాజెక్టులు డిస్కషన్ లో వుంటున్నాయి తప్ప మెటీరియలైజ్ కావడం లేదు.
మరి వీళ్ల సమస్య ఎప్పుడు తీరుతుందో..వాళ్ల సమస్య ఎప్పుడు గట్టెక్కుతుందో?