చరణ్ తో సమంత

సినిమాలు సరైనవి చేస్తున్నా హిట్ లు లేక కిందా మీదా అవుతోంది సమంత. ఇప్పుడు మళ్లీ మరో మాంచి చాన్స్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. చరణ్ తో శ్రీనువైట్ల చేయబోయే సినిమాకు ఆమెను కథానాయిక…

సినిమాలు సరైనవి చేస్తున్నా హిట్ లు లేక కిందా మీదా అవుతోంది సమంత. ఇప్పుడు మళ్లీ మరో మాంచి చాన్స్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. చరణ్ తో శ్రీనువైట్ల చేయబోయే సినిమాకు ఆమెను కథానాయిక గా తీసుకున్నట్లు వినికిడి. 

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా మెగా క్యాంప్ లో అడుగుపెడితే, ముగ్గురు (పవన్, చరణ్, బన్నీ) ఓ రౌండ్ వేసేస్తారు. కానీ సమంత ఇప్పటికి పవన్ పక్కన నటించింది. బన్నీ పక్కన చేస్తోంది. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. శ్రీను వైట్ల ఈ కాంబినేషన్ సెట్ చేసాడు. చరణ్ ఓకే చేసాడు అని తెలుస్తోంది.