వర్మకు దొరికేసాడా?

కొందరికి ఓ టాలెంట్ వుంటుంది. ఎదుటివార్ని వలేసి పట్టగలగడం. అలాంటి టాలెంట్ దర్శకుడ రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా వుంది. సినిమా తయారై, విడుదలయ్యే లోగా, ఇంకో సినిమాకు నిర్మాతను పట్టేస్తాడు..మరో సినిమాకు…

కొందరికి ఓ టాలెంట్ వుంటుంది. ఎదుటివార్ని వలేసి పట్టగలగడం. అలాంటి టాలెంట్ దర్శకుడ రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా వుంది. సినిమా తయారై, విడుదలయ్యే లోగా, ఇంకో సినిమాకు నిర్మాతను పట్టేస్తాడు..మరో సినిమాకు హీరోను రెడీ చేస్తాడు. 

సరే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు ఎన్ని రామ్ స్కూలు నుంచి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాయో  లెక్కా జమా లేదు. ఇప్పుడు మరో సౌండ్ పార్టీ రామ్ కు చేరువయిందట. 

సినిమాలంటే బోలెడు పిచ్చి, బోలెడు డబ్బు ఖర్చు చేయగల సచిన్ జోషి ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తాడట. ఆ మధ్య సచిన్ కు వర్మ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ చెప్పినట్లు, దానికి సచిన్ ఓకే..అలాగే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.