గోపాల గోపాల ఆడియో 4 వ తేది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇంతకీ గోపాల గోపాల విడుదల ఎప్పుడు? 9న లేదా 14న? తొమ్మిదని అయితే విడుదలయ్యే చాన్స్ దాదాపు లేదని తెలుస్తోంది. ఇంకా డబ్బింగ్ పనులు కూడా బ్యాలెన్స్ వున్నయని వినికిడి. తొమ్మిదిన అంటే మిగిలింది వారం కూడా లేదు. ఇంకా సెన్సార్ కూడా కావలసి వుంది.
అందువల్ల ఇక తొమ్మిదిన రావడం అన్నది కష్టమే కావచ్చు. మిగిలిన తేదీ 14. అదే రోజు ఐ విడుదల వుంది. ఎంత పవర్ స్టార్ వున్నా, గోపాల గోపాల సబ్జెక్ట్ రీత్యా, బి సి సెంటర్లకు ఎక్కుతుందా అన్నది అనుమానం. భక్తుడు..భగవంతుడు కాన్సెప్ట్ ఎఎన్నార్ బుద్ధిమంతుడు వర్కవుట్ కాలేదు..నాగ్-విష్ణుల కృష్ణావతారం, నాగ్-ప్రకాష్ రాజ్ ల ఢమరుకం కూడా క్లిక్ కాలేదు.
పైగా ఓఎమ్ జి ని అలాగే తీసి వుంటే, అందులో కాస్త ఇంటలెక్చ్యువల్ వ్యవహారం వుంటుంది. సంక్రాంతి సీజన్ కు ఈ తరహా సినిమాల కన్నా మాస్ ఎంటర్ టైనర్ లే నప్పుతాయి. అందువల్ల లాస్ట్ మినిట్ లో కాస్త వెనక్కు పంపినా ఆశ్చర్యం లేదు. కానీ 4న అడియో ఫంక్షన్ అన్నారంటే, అలా వెనక్కు వెళ్లే ఉద్దేశం లేనట్లే అనుకోవాలి.